“ఎన్టీఆర్” బయోపిక్ లో మహేష్ బాబు

బాలక్రిష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న “ఎన్టీఆర్” బయోపిక్ లో ఇప్పటికే పెద్ద నటీనటులు అందరూ ఉన్నారు. బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తే, అక్కినేని నాగేశ్వర్ రావు గా సుమంత్ నటిస్తున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు నటిస్తే బాగుంటుంది అని బాలక్రిష్ణ భావిస్తున్నాడట. “ఎన్టీఆర్” బయోపిక్ చిత్రంలో మహేష్ నటిస్తే అంచనాలు మరో స్థాయికి వెళ్తాయి అనేది నిజం. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కూడా కీలకం అని బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుకు బాలయ్య ఫోన్ చేసాడట. “ఎన్టీఆర్” బయోపిక్ చిత్రంలో కృష్ణ పాత్రలో నటించాలని కోరినట్లు తెలుస్తోంది. దీనితో త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని బాలయ్యకు మహేష్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. “ఎన్టీఆర్” బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే.