Telugu Global
NEWS

శునకానందతో పెట్టుకుంటే రిటైర్‌ అవ్వాల్సిందే " రోజా

జగన్‌పై హత్యాయత్నం కేసులో చంద్రబాబే ఏ-1 ముద్దాయి అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఇంతపెద్ద ఘటన జరిగినా చంద్రబాబు వికృతంగా, హేళనగా మాట్లాడడం బట్టి చూస్తుంటే ఆయన ఒక శునకానంద అని అర్థమవుతోందన్నారు. ఇకపై ప్రతి ఒక్కరూ చంద్రబాబును శునకానందపార్టీ నేత అని పిలవాలని సూచించారు. రాహుల్‌ గాంధీతో కలిసి టీడీపీని తెలుగు దాల్ పప్పు పార్టీగా చంద్రబాబు మార్చేశారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను, వంగవీటి రాధాను చంద్రబాబు ఎలా చంపించారో అందరూ చూశారన్నారు. అదే […]

శునకానందతో పెట్టుకుంటే రిటైర్‌ అవ్వాల్సిందే  రోజా
X

జగన్‌పై హత్యాయత్నం కేసులో చంద్రబాబే ఏ-1 ముద్దాయి అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఇంతపెద్ద ఘటన జరిగినా చంద్రబాబు వికృతంగా, హేళనగా మాట్లాడడం బట్టి చూస్తుంటే ఆయన ఒక శునకానంద అని అర్థమవుతోందన్నారు. ఇకపై ప్రతి ఒక్కరూ చంద్రబాబును శునకానందపార్టీ నేత అని పిలవాలని సూచించారు. రాహుల్‌ గాంధీతో కలిసి టీడీపీని తెలుగు దాల్ పప్పు పార్టీగా చంద్రబాబు మార్చేశారని ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్‌ను, వంగవీటి రాధాను చంద్రబాబు ఎలా చంపించారో అందరూ చూశారన్నారు. అదే దాడి జగన్‌పై కాకుండా చంద్రబాబుపై జరిగి ఉంటే ఎల్లో మీడియా, టీడీపీ నేతలు ఎంత డ్రామా చేసేవారో అందరికీ తెలుసన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి పదేపదే కులం గురించి మాట్లాడుతున్నారని… మనిషికి కావాల్సింది కులం కాదు గుణం అన్నారు. కోడి కత్తితో మనుషులను ఎలా చంపుతారని ప్రశ్నిస్తున్న జేసీ దివాకర్‌ రెడ్డి ఒకసారి కోడికత్తితో పొడుచుకుంటే అర్థమవుతుందన్నారు.

నిజంగా చంద్రబాబు ధర్మపోరాటం చేయాలనుకుంటే ఢిల్లీలో చేయాలి గానీ… దొంగలు గల్లీల్లో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడిన చరిత్ర లేదన్నారు. చంద్రబాబుతో పొత్తు తర్వాతే దేవేగౌడ, వాజ్‌పేయి, ఐకే గుజ్రాల్‌ రిటైర్ అయిపోయారని…. ఇప్పుడు చిన్న వయసులోనే పొత్తు పెట్టుకున్న రాహుల్‌ కూడా రిటైర్ అవ్వాల్సిందేనన్నారు. ఆపరేషన్‌ గరుడలో చెప్పినవే జరుగుతున్నాయని చంద్రబాబే చెబుతుంటే… వాటిని అడ్డుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు విఫలమైందన్నారు.

ఆపరేషన్ గరుడ నిజమైతే ప్రభుత్వం గాడుదులు కాస్తోందా అని నిలదీశారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఉండి ఏం లాభమని రోజా ప్రశ్నించారు. ఆపరేషన్‌ గరుడ వెనుక కేంద్రం ఉంటే ఢిల్లీ వెళ్లిన సమయంలో దానిపై సీబీఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు.

గతంలో రాహుల్‌పై చెప్పులేయించిన చంద్రబాబు… ఇప్పుడు అదే రాహుల్‌ గాంధీ చెప్పులను నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటున్నారని నిలదీశారు.

First Published:  5 Nov 2018 6:37 AM GMT
Next Story