Telugu Global
NEWS

శేరిలింగంపల్లి సీటు కోసం పార్టీల స్టంట్

రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ సీట్లలో శేరిలింగంపల్లి…. హాట్ కేక్ లా మారింది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఈ సీటుకోసం దేనికైనా సై అంటున్నారు. కాంగ్రెస్.. తెలుగుదేశం… బీజేపీ.. ఇలా ఒకరేమిటి అంతా పోటీపడుతున్నాయి. ఈ పార్టీల ఆశావహ అభ్యర్థులయితే… ఈ సీటు నాకంటే నాకంటూ.. ధర్నాలు.. ఆందోళనలు.. ఆమరణ దీక్షలు.. ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు. శేరిలింగంప‌ల్లి సీటు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. టిడిపి.. బీజేపీ.. పొత్తులో భాగంగా తెలుగుదేశం నుంచి అరేకపూడి గాంధీ సీటుదక్కించుని… […]

శేరిలింగంపల్లి సీటు కోసం పార్టీల స్టంట్
X

రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ సీట్లలో శేరిలింగంపల్లి…. హాట్ కేక్ లా మారింది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఈ సీటుకోసం దేనికైనా సై అంటున్నారు. కాంగ్రెస్.. తెలుగుదేశం… బీజేపీ.. ఇలా ఒకరేమిటి అంతా పోటీపడుతున్నాయి. ఈ పార్టీల ఆశావహ అభ్యర్థులయితే… ఈ సీటు నాకంటే నాకంటూ.. ధర్నాలు.. ఆందోళనలు.. ఆమరణ దీక్షలు.. ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు.

శేరిలింగంప‌ల్లి సీటు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. టిడిపి.. బీజేపీ.. పొత్తులో భాగంగా తెలుగుదేశం నుంచి అరేకపూడి గాంధీ సీటుదక్కించుని… ఆ ఎన్నికల్లో ఒక లక్షా 29వేలకు పైగా ఓట్లు సాధించారు. ఆ తర్వాత గాంధీ.. తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లోనికి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గాంధీ కే సీటిచ్చింది. ఇక మిగిలిన పార్టీలుగా కాంగ్రెస్.. తెలుగుదేశం.. బీజేపీ..ఈ మూడు పార్టీలోనూ శేరిలింగంపల్లి సీటు కేటాయింపు…. పెద్ద లొల్లిగా మారింది.

ఇక…. మహాకూటమి గా ప్రయాణం సాగిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం లోనూ ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన సీటుగా.. పొత్తుల్లో శేరిలింగంపల్లి మాదే అంటోంది తెలుగుదేశం. ఇక్కడి నుంచి పైసా వసూల్ నిర్మాత భవ్య ఆనంద్ ప్ర‌సాద్‌కు సీటిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది.

దీంతో.. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న మువ్వ సత్యనారాయణ వ‌ర్గం ఇప్పుడు భ‌గ్గుమంటోంది. ఆదివారం ప్ర‌సాద్ ర్యాలీ తీస్తే మువ్వ వ‌ర్గం అడ్డుకుంది. ర్యాలీపై చెప్పులు విసరడంతో ఒక ద‌శ‌లో ఇరువ‌ర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని మువ్వ వ‌ర్గం నేత‌ల‌ను అరెస్టు చేశారు.

ఒంటరి పోరుకు సిద్ధపడిన బీజేపీ ఈ సీటులో వ్యాపార‌వేత్త‌ యోగానంద్ పేరును ప్రకటించింది. ప్రకటనకు ముందే ఇక్కడ తమకు పార్టీ సీటిస్తుందని ప్రచారం ప్రారంభించిన డాక్టర్ నరేష్, భాస్కర్ రెడ్డి లు ఆమరణ దీక్షకు దిగారు. కొందరు కార్యకర్తలయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎక్కి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు.

ఇప్పుడు శేరిలింగంపల్లి కాంగ్రెస్ వంతుకు వచ్చింది. కూటమి పొత్తుల్లో తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు ఇస్తున్నట్లు.. అందులో శేరిలింగంపల్లి ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు రావడంతో.. కాంగ్రెస్ ఆశావహులు రంగంలో కి దిగారు.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తర్వాత.. మూడో స్థానంలో 43,348 ఓట్లతో భిక్షపతి యాదవ్ నిలిచారు. ఈసారి తెలుగుదేశం తో పొత్తు ఉండటంతో తన విజయం ఖాయమని ఈసీటు తనకే ఇవ్వాలంటూ ఆందోళనలకు దిగుతున్నారు. కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో ఆందోళ‌న చేశారు. చివ‌ర‌కు మ‌ధుయాష్కీ స‌ర్దిచెప్ప‌డంతో ఆందోళ‌న విరమించారు.

ఇదీ శేరిలింగంపల్లి సీటు కోసం అభ్యర్థుల స్టంట్. అయితే… అన్నిపార్టీల ఫైటింగ్ లను ఓటర్ గుంభనంగా గమనిస్తున్నాడు.

First Published:  4 Nov 2018 8:16 PM GMT
Next Story