Telugu Global
National

కాంగ్రెస్ విజయం.... టీడీపీ సంబరాలు!

కర్ణాటకలో వివిధ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ ల కూటమి విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ విషయంలో తెలుగుదేశం నేతలు తమ వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది అని.. టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఓటమి తమ గెలుపు అన్నట్టుగా టీడీపీ నేతలు స్పందిస్తుండడం విశేషం. అంతే కాదట.. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల కూటమి గెలిచినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ […]

కాంగ్రెస్ విజయం.... టీడీపీ సంబరాలు!
X

కర్ణాటకలో వివిధ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ ల కూటమి విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ విషయంలో తెలుగుదేశం నేతలు తమ వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది అని.. టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఓటమి తమ గెలుపు అన్నట్టుగా టీడీపీ నేతలు స్పందిస్తుండడం విశేషం.

అంతే కాదట.. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల కూటమి గెలిచినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీల కూటమి గెలుస్తుందని కూడా ఏపీ టీడీపీ నేతలు అంటూ ఉండటం విశేషం.

ప్రస్తుతానికి బీజేపీని బూచిగా చూపి తాము లబ్ధి పొందే ప్రయత్నంలో ఉన్నారు తెలుగుదేశం నేతలు. అందుకే కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం కూడా తమ గెలుపు అన్నట్టుగా టీడీపీ నేతలు రియాక్ట్ అయిపోతున్నారు.

First Published:  6 Nov 2018 5:34 AM GMT
Next Story