Telugu Global
NEWS

కోదండరాంపై కేసీఆర్ నజర్.... ఓడించేందుకు కీలక నిర్ణయం....

ఉద్యమ సమయంలో ఆయన సన్నిహితుడు. కానీ అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థిగా మారిపోయాడు. కేసీఆర్ పాలన నచ్చక తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత పార్టీ పెట్టాడు. ఇప్పుడు ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడానికి కూటమితో జట్టుకట్టి ప్లాన్లు వేస్తున్నాడు. ఆయనే కోదండరాం.. కానీ కేసీఆర్ ఊరుకుంటాడా ఇప్పుడు మాస్టర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. తాజాగా కోదండరాం పోటీచేసే స్థానాలపై కేసీఆర్ నజర్ పెట్టినట్టు సమాచారం. కోదండరాం పోటీచేసే స్థానాల్లో ముఖ్యమైనది రామగుండం.. మహాకూటమిలో భాగంగా ఇక్కడి నుంచే […]

కోదండరాంపై కేసీఆర్ నజర్.... ఓడించేందుకు కీలక నిర్ణయం....
X

ఉద్యమ సమయంలో ఆయన సన్నిహితుడు. కానీ అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థిగా మారిపోయాడు. కేసీఆర్ పాలన నచ్చక తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత పార్టీ పెట్టాడు. ఇప్పుడు ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడానికి కూటమితో జట్టుకట్టి ప్లాన్లు వేస్తున్నాడు. ఆయనే కోదండరాం.. కానీ కేసీఆర్ ఊరుకుంటాడా ఇప్పుడు మాస్టర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.

తాజాగా కోదండరాం పోటీచేసే స్థానాలపై కేసీఆర్ నజర్ పెట్టినట్టు సమాచారం. కోదండరాం పోటీచేసే స్థానాల్లో ముఖ్యమైనది రామగుండం.. మహాకూటమిలో భాగంగా ఇక్కడి నుంచే కోదండరాం పోటీచేస్తారని తెలుస్తోంది. ఈ సీటులోనే ఆయన పోటీచేస్తారని వార్తలు లీక్ అయ్యాయి. కోదండరాం గెలిస్తే ఏకు మేకు అవుతాడని గ్రహించి కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం. కోదండరాం ఎక్కడ పోటీచేసినా ఓడించి తీరాలని టీఆర్ఎస్ టార్గెట్ పెట్టుకుంది.

టీఆర్ఎస్ పార్టీ వేగులు, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రస్తుతం కోదండరాం పోటీచేసే నియోజకవర్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రామగుండం నియోజకవర్గంలో టీజేఎస్ కు ఎంత బలముంది..? ఇక్కడున్న సింగరేణి కార్మికుల్లో ఉన్న ఆదరణ, మిత్రపక్షాలు ఏ స్థాయిలో సహకరిస్తాయనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.

అంతేకాదు.. కోదండరాంను ఓడించేందుకు ఏకంగా హరీష్ రావు, కేటీఆర్ లకు బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు సమాచారం. మహాకూటమిలో ప్రధాన నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాంలపై ఫుల్ ఫోకస్ పెట్టిన కేటీఆర్ వీరిద్దరిని ఓడిస్తే కాంగ్రెస్ కూటమి ఖేల్ కథమవుతుందని భావిస్తున్నారు. అందుకే ఇప్పటిదాకా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పై అభ్యర్థిని దించలేదు. బలమైన గుత్తా సుఖేందర్ రెడ్డిని దించేందుకు రెడీ అయ్యారు. కోదండరాం, ఉత్తమ్ లను ఓడిస్తే కూటమి స్థైర్యం దెబ్బతిని తేడా వచ్చినా ఆ పార్టీనాయకులు టీఆర్ఎస్ కు వలసవస్తారని భావిస్తున్నారు. మరి కేసీఆర్ వేసిన ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

First Published:  6 Nov 2018 1:05 AM GMT
Next Story