అక్కినేని ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీలోకి  

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్ అన్న సాయి ధరం తేజ్ ఇప్పటికే ఇండస్ట్రీ లో సుప్రీమ్ హీరోగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా తమ్ముడి కెరీర్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడు సాయి ధరం తేజ్. ఇప్పటికే తమ్ముడి సినిమాకి సుకుమార్ ని ప్రొడ్యూసర్ గా సెట్ చేసిన సాయి ధరం తేజ్ ఇప్పుడు తమ్ముడి కోసం హాట్ బ్యూటి ని హీరోయిన్ గా పట్టుకొచ్చాడు.

ఇటివలే నాగ చైతన్య తో “సవ్యసాచి” లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ వైష్ణవ్ తేజ్ సరసన్ హీరోయిన్ గా నటిస్తుంది. “సవ్యసాచి” సినిమా ద్వారా గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం అఖిల్ సరసన “మిస్టర్ మజ్ను” లో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే వైష్ణవ్ తేజ్ షూటింగ్ లో జాయిన్ అవుతుంది నిధి. మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ అసిస్టెంట్ బుచ్చి బాబు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.