వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన పెద్ద కూతురు పెళ్లి నిశ్చయించాడు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి దగ్గరి మిత్రుడు రఘురామి రెడ్డి తనయుడితో ఆశ్రిత వివాహం జరుగనుంది. ఆశ్రిత ది లవ్ మ్యారేజ్. తన ప్రేమ విషయాన్నీ తండ్రి వెంకటేష్ కు అలాగే పెద్దనాన్న దగ్గుబాటి సురేష్ బాబు కి చెప్పడంతో మొదట కాస్త షాక్ కి గురైనప్పటికీ తర్వాత లైట్ గా తీసుకొని ఆశ్రిత ప్రేమ వివాహానికి పచ్చజెండా ఊపారు. దగ్గుబాటి సురేష్ బాబు దగ్గరుండి మరీ పెళ్లి వ్యవహారాలు చక్కబెడుతున్నాడట.

ఇక అబ్బాయి తరుపు వాళ్ళు మంచి సంభందం కాబట్టి ఈ పెళ్లి ఒప్పుకొని పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేసారు అని తెలుస్తుంది. వచ్చే నెల ఈ పెళ్లిని చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నాడు విక్టరీ వెంకటేష్. ఈ పెళ్లి దేశంలోని ముఖ్య మైన సెలబ్రిటీలు అందరూ వచ్చే అవకాశం ఉంది అని ఒక అంచనా. ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకీ “ఎఫ్ 2” అలాగే “వెంకీ మామ” సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల పనులు త్వరగా పూర్తీ చేసి పెళ్లి పనుల్లో బిజీ అయిపోతాడు వెంకటేష్.