కందిరీగ కంటే చిన్న దాడి – జగన్‌ పై హత్యాయత్నం పై మంత్రి ఆది

జగన్‌పై దాడి అంతా ఒక క్రియేషన్‌ అని ఆరోపించారు ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి. ఎయిర్‌పోర్టులో దాడి క్రియేషన్ ఒన్‌ అయితే…. ఆస్పత్రిలో చేరడం క్రియేషన్‌ టూ అని…. ఆతర్వాత సర్జికల్ బ్యాగ్ కట్టుకోవడం క్రియేషన్ త్రీ అని ఆది చెప్పారు.

జగన్‌పై దాడి కందిరీగ దాడి కంటే చిన్నదన్నారు. కందిరీగ కుట్టినా ఇంకా ఎక్కువ రక్తమే వచ్చేదని చెప్పారు. ఒకేసారి బాహుబలి 1,2,3లను జగన్‌ చూపించారని ఎద్దేవా చేశారు. అంత గాయమే అయి ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా హైదరాబాద్‌ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

దాడి ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు కరెక్ట్‌గా రిపోర్టు ఇవ్వకపోతే వారి ఉద్యోగాలకే భద్రత ఉండదన్నారు. నిందితులు శ్రీనివాస్ 20 లక్షలు పెట్టి ఇల్లు కడుతుండడం, ఆరేడు సెల్‌ఫోన్లు మార్చిన నేపథ్యంలో కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు.