Telugu Global
Cinema & Entertainment

లీకులపై అక్షర షాకింగ్ రియాక్షన్

తమకు సంబంధించిన ప్రైవేట్  స్టిల్స్ ఏమైనా లీక్ అయితే హీరోయిన్లు ఎవరైనా ఒకేలా స్పందిస్తారు. కొందరేమో ఆ ఫొటోల్లో ఉన్నది తను కాదంటారు. మరికొందరేమో అవి ఎలా లీక్ అయ్యాయో తెలీదని ఆశ్చర్యం వ్యక్తంచేస్తారు. ఇంకొందరు వెంటనే వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కమల్ చిన్నకూతురు అక్షర హాసన్ మాత్రం వీటిలో ఏ కోవలోకి రాదు. ఆమె రియాక్షన్ సంథింగ్ స్పెషల్ గా ఉంది. రీసెంట్ గా అక్షర హాసన్ కు చెందిన బికినీ […]

లీకులపై అక్షర షాకింగ్ రియాక్షన్
X

తమకు సంబంధించిన ప్రైవేట్ స్టిల్స్ ఏమైనా లీక్ అయితే హీరోయిన్లు ఎవరైనా ఒకేలా స్పందిస్తారు. కొందరేమో ఆ ఫొటోల్లో ఉన్నది తను కాదంటారు. మరికొందరేమో అవి ఎలా లీక్ అయ్యాయో తెలీదని ఆశ్చర్యం వ్యక్తంచేస్తారు. ఇంకొందరు వెంటనే వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కమల్ చిన్నకూతురు అక్షర హాసన్ మాత్రం వీటిలో ఏ కోవలోకి రాదు. ఆమె రియాక్షన్ సంథింగ్ స్పెషల్ గా ఉంది.

రీసెంట్ గా అక్షర హాసన్ కు చెందిన బికినీ ఫొటోలు వెబ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. తన బెడ్ రూమ్ లో అక్షర సెల్ఫీలు తీసుకున్నట్టు ఆ ఫొటోలు ఉన్నాయి. అయితే అవి తన సెల్ఫీలు కావంటోంది అక్షర. ఓ సినిమా ఫొటోషూట్ కోసం అలా పోజులిచ్చానని చెబుతోంది. పైగా ఆ ఫొటోల్లో తప్పేముందని ప్రశ్నిస్తోంది. ఈ రోజుల్లో హీరోయిన్లంతా బికినీలు వేసుకొని అలానే ఫొటోలు దిగుతున్నారని, అందులో తప్పేముందని ప్రశ్నిస్తోంది.

అయితే ఒక విషయంలో మాత్రం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది అక్షర. తన అనుమతి లేకుండా, ఆ ఫొటో షూట్ స్టిల్స్ ను లీక్ చేయడం తప్పంటోంది. ఆ యాంగిల్ లో త్వరలోనే సదరు నిర్మాతలపై కేసు పెడతానని ప్రకటించింది. అంటే, అవి లీక్ చేసింది ఎవరో అక్షర హాసన్ కు తెలుసన్నమాట.

First Published:  7 Nov 2018 8:55 AM GMT
Next Story