Telugu Global
NEWS

అధినేతే ప్రచారం చేయడా.... టీడీపీపై సెటైర్లు!

సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి అధినేతే మూలస్తంభం. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల్లో అధినేతే నియంత. అధినేతే సర్వం. అతడిని చూసే ఓట్లు పడతాయి. జాతీయ పార్టీల్లో కూడా అధ్యక్ష హోదాలో ఉన్న నేతలే ఆయువుపట్టు. వారి సామర్థ్యం, వారి చరిష్మాను బట్టే ఆ పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. దీనికి తెలుగుదేశం కూడా మినహాయింపు కాదు. టీడీపీని జాతీయ పార్టీగా చెబుతారు కానీ..ఇది ప్రాంతీయ పార్టీనే. మరి ఇలాంటి పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ గెలుపోటములన్నీ […]

అధినేతే ప్రచారం చేయడా.... టీడీపీపై సెటైర్లు!
X

సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి అధినేతే మూలస్తంభం. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల్లో అధినేతే నియంత. అధినేతే సర్వం. అతడిని చూసే ఓట్లు పడతాయి. జాతీయ పార్టీల్లో కూడా అధ్యక్ష హోదాలో ఉన్న నేతలే ఆయువుపట్టు. వారి సామర్థ్యం, వారి చరిష్మాను బట్టే ఆ పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. దీనికి తెలుగుదేశం కూడా మినహాయింపు కాదు. టీడీపీని జాతీయ పార్టీగా చెబుతారు కానీ..ఇది ప్రాంతీయ పార్టీనే.

మరి ఇలాంటి పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ గెలుపోటములన్నీ చంద్రబాబు మీదే ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడే టీడీపీ తరపున ప్రచారం చేయకపోవడం ఆసక్తిదాయకంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరుగుతూ ఉందిప్పుడు.

చంద్రబాబు నాయుడు తను తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయను అని ఇప్పటికే స్పష్టం చేశాడు. ఇదే ఇప్పుడు టీడీపీ ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చి ప్రచారం చేయకపోవడాన్ని విమర్శిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్లు.

చంద్రబాబుకు దమ్ముంటే తెలంగాణకు వచ్చి ప్రచారం చేయాలని కూడా వారు సవాల్ విసురుతున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీ నుంచి స్పందన లేదు. చంద్రబాబే స్వయంగా తను ప్రచారం చేయను అని స్పష్టం చేయడంతో టీడీపీ ఈ అంశంపై స్పందించడం లేదు.

బాబు ప్రచారం చేస్తే వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువని కాంగ్రెస్ వాళ్లు కూడా ఆయనను ప్రచారానికి వద్దని అంటున్నారట. మరి ఒక ప్రాంతీయ పార్టీ తరఫున దాని అధినేతే ప్రచారం చేయకపోవడంపై విమర్శలు తప్పడం లేదు.

First Published:  6 Nov 2018 9:38 PM GMT
Next Story