Telugu Global
NEWS

చంద్రబాబు పాలన మాత్రం కమ్మగా ఉంటుందా..... కోదండరాం గారూ....

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గెలుపు నమ్మకం తగ్గుతోందన్న అభిప్రాయం మీడియాలో మాత్రమే ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము 100 సీట్లు గెలుస్తామని చెప్పినప్పుడు చాలా మంది నవ్వారని…. కానీ అది నిజమైందన్నారు. ఇప్పుడు కూడా ప్రజల మూడ్‌ను బాగా గమనించిన తర్వాతే తాను చెబుతున్నానని అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు సాధించి తీరుతామన్నారు. 67 ఏళ్లలో పరిష్కారం కాని విద్యుత్ సమస్యను తెలంగాణలో కేవలం నాలుగేళ్లలోనే పరిష్కరించిన ప్రభుత్వం తమది అన్నారు. బీడు […]

చంద్రబాబు పాలన మాత్రం కమ్మగా ఉంటుందా..... కోదండరాం గారూ....
X

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గెలుపు నమ్మకం తగ్గుతోందన్న అభిప్రాయం మీడియాలో మాత్రమే ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము 100 సీట్లు గెలుస్తామని చెప్పినప్పుడు చాలా మంది నవ్వారని…. కానీ అది నిజమైందన్నారు.

ఇప్పుడు కూడా ప్రజల మూడ్‌ను బాగా గమనించిన తర్వాతే తాను చెబుతున్నానని అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు సాధించి తీరుతామన్నారు. 67 ఏళ్లలో పరిష్కారం కాని విద్యుత్ సమస్యను తెలంగాణలో కేవలం నాలుగేళ్లలోనే పరిష్కరించిన ప్రభుత్వం తమది అన్నారు.

బీడు భూములకు నీరు కళ్లముందే వస్తున్నాయన్నారు. కరెంట్‌ అడిగితే కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. సోనియాను తాము విమర్శిస్తే తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్‌ నేతలు… ముందు… సోనియా ఇటలీ దయ్యం, సోనియాగాంధీ ఇటలీ మాఫియా, సోనియా గాడ్సే, సోనియా అవినీతి అనకొండ, కాంగ్రెస్ ఈ దేశానికి దరిద్రం అన్న చంద్రబాబుతో సిగ్గులేకుండా పొత్తు పెట్టుకున్నందుకు సమాధానం చెప్పాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం చేతిలో బంధీ అయిందన్న విమర్శలకు కేటీఆర్‌ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ”రాహుల్‌ గాంధీ కుటుంబం చేతిలో దేశం 70 ఏళ్లు బంధీగా ఉన్నా పర్వాలేదు….. చంద్రబాబు కుమారుడు ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి కావొచ్చు, ఆయన బామ్మర్ది ఎమ్మెల్యే కావొచ్చు…. చంద్రబాబు కుటుంబ పాలన చాలా కమ్మగా ఉంటుంది…. తెలంగాణకు వచ్చే సరికి మాత్రం కేసీఆర్‌ పాలన చేదుగా ఉంటుందా” అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తామేమీ చంద్రబాబు కుమారుడిలాగా ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి పదవులు తీసుకోలేదన్నారు.

ప్రజల నుంచి ఎన్నికై ఎమ్మెల్యేలుగా వచ్చామని గుర్తు చేశారు. ఒకవేళ ప్రజలు తిరస్కరిస్తే ఇంట్లో ఉంటామన్నారు. నలుగురి చేతిలో తెలంగాణ బంధీ అయిందని డైలాగులు కొట్టే కోదండరాం…. మరి ఏ ముఖం పెట్టుకుని టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు.

చంద్రబాబు ఇంట్లో, రాహుల్‌ ఇంట్లో కుటుంబపాలన లేదా అని కేటీఆర్‌ నిలదీశారు. ముందస్తు ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలు హర్షించాలి గానీ ఎందుకు విమర్శలు చేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలను అడ్డుకునేందుకు ఈసీ వద్దకు, కోర్టుల వద్దకు వెళ్లారంటే…. దీన్ని బట్టే కాంగ్రెస్‌ ఎన్నికలను చూసి ఎంతగా భయపడుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు.

2014 ఎన్నికల్లోనూ, ఇప్పుడు కూడా తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని…. అలాంటప్పుడు బీజేపీతో తమకు ప్రయోజం ఏమిటి? వారితో కలిసి ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ గానీ, బీజేపీ గానీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వంద స్థానాల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. ఇప్పుడు బీజేపీ చేతిలో ఉన్న ఐదు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపని చెప్పారు.

మహాకూటమికి మేనిఫెస్టో ఎక్కడుందని ప్రశ్నించారు. మూడు సీట్లలో పోటీ చేస్తున్న కోదండరాంకు ఒక మేనిఫెస్టో, సీపీఐకి ఒక మేనిఫెస్టో, టీడీపీకి ఒక మేనిఫెస్టో, కాంగ్రెస్‌కు మరో మేనిఫెస్టో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పెద్దల భార్యలే కాంగ్రెస్‌ను వీడి మరో పార్టీలో చేరుతున్నారని… అలాంటి వారు కూడా ఎదుటి వారిపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

First Published:  7 Nov 2018 10:45 AM GMT
Next Story