మిస్టర్ మజ్ను మళ్లీ ముందుకొచ్చాడు

అక్కినేని అఖిల్ నటిస్తున్న మూడో సినిమా మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఎందుకంటే అక్కినేని హీరోలకు గతంలో డిసెంబర్ నెల బాగా కలిసొచ్చింది. అందుకే ఈ ప్రకటన చేశారు. అయితే ఆ టైమ్ లో థియేటర్లలో రిలీజ్ ల తాకిడి ఎక్కువగా ఉంది. అఖిల్ కేమో అన్నీ ఫ్లాపులే ఉన్నాయి. అందుకే ఎందుకైనా మంచిదని వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14కు సినిమాను వాయిదావేశారు. ఇప్పుడు ఆ తేదీ నుంచి మరోసారి వెనక్కి వచ్చింది మిస్టర్ మజ్ను సినిమా.
అటు డిసెంబర్ కాకుండా, ఇటు ఫిబ్రవరి వరకు సినిమాను సాగదీయకుండా మధ్యేమార్గంగా జనవరి నెలలో వస్తున్నామని ప్రకటించారు. దీపావళి సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేసి మరీ జనవరికి వస్తున్నట్టు తెలిపారు. అలా అని ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదు. సంక్రాంతి సందడంతా ముగిసిన తర్వాత జనవరి నెల నాలుగో వారంలో థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమా.
ఇలా ఫిబ్రవరి నుంచి జనవరికి రావడానికి కూడా ఓ కారణం ఉంది. లెక్కప్రకారం, జనవరి నెలాఖరుకు ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2ను విడుదల చేయాలనుకున్నారు. కానీ అభిమానుల కోరిక మేరకు ఆ సినిమాను ఫిబ్రవరికి వాయిదావేశారు. అలా ఏర్పడిన ఖాళీని మిస్టర్ మజ్నుతో భర్తీ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అదన్నమాట సంగతి.