Telugu Global
NEWS

టీ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు పెట్టిన చంద్రబాబు?

అసలే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు కొదవలేదు. ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్ లో ఇలాంటి వాటికి లోటే లేదు. ఎవరికి వారు తామే ముఖ్యమంత్రి అభ్యర్థులం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. వీళ్ళు రేపటి ఎన్నికల్లో కూడా ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి లేదు. ఎవరికి వారు తమకు ప్రత్యర్థులను ఓడించాలని చూస్తూ ఉంటారు. ప్రత్యర్థులు అంటే అవతల పార్టీలోని వారు కాదు.. కాంగ్రెస్ లో, ఒకే పార్టీలో ఉంటూ ప్రత్యర్థులుగా చలామణి అయ్యే నేతలు […]

టీ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు పెట్టిన చంద్రబాబు?
X

అసలే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు కొదవలేదు. ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్ లో ఇలాంటి వాటికి లోటే లేదు. ఎవరికి వారు తామే ముఖ్యమంత్రి అభ్యర్థులం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. వీళ్ళు రేపటి ఎన్నికల్లో కూడా ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి లేదు. ఎవరికి వారు తమకు ప్రత్యర్థులను ఓడించాలని చూస్తూ ఉంటారు.

ప్రత్యర్థులు అంటే అవతల పార్టీలోని వారు కాదు.. కాంగ్రెస్ లో, ఒకే పార్టీలో ఉంటూ ప్రత్యర్థులుగా చలామణి అయ్యే నేతలు చాలా మంది ఉన్నారు.

ప్రత్యేకించి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో కాంగ్రెస్ నేతల మధ్యన విభేదాలకు కొదవలేదు. ఎవరికి వారు తామే ముఖ్యమంత్రి అభ్యర్థులం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేని నేతలు కూడా సీఎం సీటును ఆశిస్తూ ఉండటం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత.

అలాంటి పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త చిచ్చును పెట్టినట్టుగా తెలుస్తోంది. అదేమిటంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో రాహుల్ గాంధీ వద్ద కొన్ని షరతులు పెట్టాడట చంద్రబాబు నాయుడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ఖర్చు అంతా తనే పెట్టుకుంటా, ఎన్నికల అనంతరం కూడా కాంగ్రెస్ కే మద్దతు పలుకుతా అని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రిగా మాత్రం తన ఆమోదం ఉన్నవ్యక్తినే కూర్చోబెట్టాలని అన్నాడట.

ప్రత్యేకించి రెడ్డి సామాజికవర్గం నేతను ముఖ్యమంత్రిగా చేయవద్దని.. రెడ్లు కాకుండా.. తను చెప్పిన వేరే వాళ్లను ముఖ్యమంత్రిగా చేయాలని చంద్రబాబు నాయుడు రాహుల్ వద్ద ప్రస్తావించాడని సమాచారం.

తెలంగాణలో మెజారిటీ రెడ్లు కాంగ్రెస్ నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. పార్టీ ఏదైనా రెడ్ల ప్రమేయం తప్పనిసరి. కాంగ్రెస్ పార్టీలో అయితే రెడ్లదే హవా ఉంటుంది. అలాంటి పార్టీలో రెడ్లను ముఖ్యమంత్రిగా చేయవద్దని చంద్రబాబు నాయుడు షరతు పెట్టాడట. ఈ అంశంపై ఇప్పుడు కాంగ్రెస్ లో దుమారం రేగేలా ఉంది.

First Published:  6 Nov 2018 9:09 PM GMT
Next Story