Telugu Global
Cinema & Entertainment

"ఎన్టీఆర్" బయోపిక్ లో అనుష్క

లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రస్తుతం ఏ సినిమాలు ఒప్పుకోక ఖాళీగా ఉంటుంది. అనుష్క నుంచి చివరగా వచ్చిన సినిమా “భాగమతి”. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత మాధవన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతోంది అనే వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క “ఎన్టీఆర్” బయోపిక్ లో ఒక […]

ఎన్టీఆర్ బయోపిక్ లో అనుష్క
X

లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రస్తుతం ఏ సినిమాలు ఒప్పుకోక ఖాళీగా ఉంటుంది. అనుష్క నుంచి చివరగా వచ్చిన సినిమా “భాగమతి”. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత మాధవన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతోంది అనే వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు ఆ సినిమా పట్టాలెక్కలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క “ఎన్టీఆర్” బయోపిక్ లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది అనే వార్త ఫిల్మ్ నగర్ లో హాల్ చల్ చేస్తుంది. అలనాటి నటి సరోజి దేవి పాత్రలో అనుష్క నటించబోతుందట. ఎన్టీఆర్ జీవితం లో సరోజి దేవి కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. అందుకే సినిమాలో ఈ పాత్రని అనుష్క పోషిస్తే బాగుంటుంది అని బాలక్రిష్ణ భావించాడు. అందుకే వెంటనే బాలక్రిష్ణ అనుష్క ని ఈ పాత్ర కోసం సంప్రదించాడట. మరి అనుష్క ఈ సినిమాలో నటించేందుకు ఏ డెసిషన్ తీసుకుంది అనేది ఇంకా తెలియలేదు.

ఇదిలా ఉంటే ఇది వరకు అనుష్క ఇంకా బాలక్రిష్ణ “ఒక్క మగాడు” సినిమాలో కలిసి నటించారు. ఇకపోతే క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ “ఎన్టీఆర్” రెండు భాగాలుగా రెడి అయ్యి జనవరి లో రిలీజ్ కాబోతుంది. వారాహి చలని చిత్రం పై సాయి కొర్రపాటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

First Published:  8 Nov 2018 4:09 AM GMT
Next Story