Telugu Global
NEWS

అదే జరిగితే చంద్రబాబు పరిస్థితి ఏమిటి?

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినందుకు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇందులో ఏ సందేహం లేదు. చంద్రబాబు ఒక అవకాశవాది…. తన అవసరం కోసం ఎవరితో అయినా చేతులు కలుపుతాడు, కాంగ్రెస్ వ్యతిరేకతే పునాది గా ఏర్పడిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపేలా చేయడం చంద్రబాబు అవకాశవాదంలో పరాకాష్ట అని అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ తో చేతులు కలపడం విషయంలో అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కొనాలో […]

అదే జరిగితే చంద్రబాబు పరిస్థితి ఏమిటి?
X

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినందుకు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇందులో ఏ సందేహం లేదు. చంద్రబాబు ఒక అవకాశవాది…. తన అవసరం కోసం ఎవరితో అయినా చేతులు కలుపుతాడు, కాంగ్రెస్ వ్యతిరేకతే పునాది గా ఏర్పడిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపేలా చేయడం చంద్రబాబు అవకాశవాదంలో పరాకాష్ట అని అంతా అనుకుంటున్నారు.

కాంగ్రెస్ తో చేతులు కలపడం విషయంలో అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కొనాలో కూడా తెలుగుదేశం అభిమానులకు అర్థం కావడం లేదు. ఏదోలా చంద్రబాబు చేసిన దాన్ని వాళ్లు సమర్థించుకొంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం అది అంత తేలికగా కనిపించడం లేదు.

ఆ సంగతలా ఉంటే.. రేపు తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఓటమి పాలైతే అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏమిటి? అనేది ఆసక్తిదాయకమైన చర్చగా మారిందిప్పుడు.

మహాకూటమిలో ఇప్పటి వరకూ సీట్ల పంచాయితీనే తెగడం లేదు. ఇలాంటి కూటమి ఎన్నికల్లో ఏదో సాధించేస్తుందనే నమ్మకాలు లేవు. ఇలాంటి నేపథ్యంలో రేపు ఇలా కూటమిగా వెళ్లి కూడా ఎదురుదెబ్బ తింటే చంద్రబాబుకు అంతకు మించిన ఎదురుదెబ్బ లేదు.

కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం చేతులు కలపడాన్ని జనాలు తిరస్కరించారు అనే అభిప్రాయం కూడా గట్టిగా ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో చంద్రబాబు మార్కు రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని…. రేపు ఏపీలో కూడా అదే జరుగుతుందనే అభిప్రాయం కూడా బలపడే అవకాశాలున్నాయి.

డిసెంబర్ పదకొండున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఆ రోజున టీఆర్ఎస్ గనుక విజయబావుటా ఎగరేస్తే.. కనీసం మినిమం మెజారిటీని సాధించినా…. ఏపీలో కూడా బాబు పాలనకు కౌంట్ డౌన్ మొదలైనట్టే అని విశ్లేషకులు అంటున్నారు.

First Published:  8 Nov 2018 11:26 AM GMT
Next Story