రీ ఎంట్రీ బొద్దుగా ఇస్తున్న ఇలియానా

మాస్ మహరాజ్ రవితేజ , శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అమర్ అక్బర్ ఆంటోనీ”. ఈ సినిమాతో తెలుగు లోకి మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తుంది ఇలియానా. అయితే ఈ సినిమాలో ఇలియానా మరి బొద్దుగా కనిపిస్తుంది. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి డల్ అయిపోయిన ఇలియానా తెలుగు లోకి మాత్రం లావు అయ్యి రీ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ ఇంకా సాంగ్స్ లో ఇలియానా ని చూసి తెలుగు ప్రేక్షకులు మరి ఇంత లావైంది ఏంటి అని అనుకుంటున్నారు.

సన్నజాజిలా ఉండే ఇలియానాని చూసిన తెలుగు ప్రేక్షకులు ఈ లావు అయిన ఇలియానాని ఆధరిస్తారో లేదో చూడాలి. ఇదిలా వుంటే నవంబర్ 16 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా యొక్క విజయం అటు రవితేజ తో పాటు ఇటు శ్రీనువైట్ల కి కూడా ఏంతో అవసరం ఎందుకంటే గతం లో వచ్చిన శ్రీనువైట్ల సినిమాలు అన్ని ప్లాప్స్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా కూడా ప్లాప్ అయితే శ్రీనువైట్ల ఇక సీరియల్స్ తీసుకోవడమే మంచిది అని అంటారు. మరి రవితేజ వల్ల అయిన శ్రీను వైట్ల హిట్టు కొడతాడో లేదో చూడాలి అంటే నవంబర్ 16 వరకు వైట్ చేయాల్సిందే. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేశారు.