ఇలియానా సొంత డబ్బింగ్

రీఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని ప్లాన్ చేసిన ఇలియానా, అందుకు తగ్గట్టు తనవంతు కృషి కూడా చేస్తోంది. టాలీవుడ్ రీఎంట్రీ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీకి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది ఈ గోవాబ్యూటీ. మొన్నటివరకు తెలుగు మాట్లాడ్డానికే నిరాకరించిన ఈ హీరోయిన్, ఇప్పుడు ఏకంగా తెలుగు నేర్చుకొని, సొంతంగా తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పుకుందంటే చెప్పుకోదగ్గ విశేషమే.

కెరీర్ స్టార్టింగ్ లో కేవలం గ్లామర్ తో నెట్టుకొచ్చింది ఇలియానా. యాక్టింగ్ అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ తన అదృష్టం, అందం కలిసి ఆమెను టాప్ రేంజ్ కు తీసుకెళ్లాయి. తరుణ్ తో చేసిన భలే దొంగలు సినిమాకు ఏకంగా కోటి రూపాయల పారితోషికం కూడా అందుకుంది. కానీ రీఎంట్రీలో కేవలం అందం ఉంటేనే సరిపోదు. అంతకుమించి ఏదైనా కొత్తగా చూపించాలి. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ జనాలకు తన అంకితభావం చూపించాలి. అందుకే కష్టపడి తెలుగులో డబ్బింగ్ చెప్పింది ఇలియానా

చూస్తుంటే, ఈసారి గోవాబ్యూటీ టాలీవుడ్ పై కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టినట్టుంది. అయితే గతంలోలా అమెకు వరుసగా అవకాశాలు వస్తాయా అనేది డౌట్. ఎందుకంటే ఇలియానాను ఇప్పటి కుర్రహీరోలు పట్టించుకోరు. దీనికితోడు ఆమె కాస్త లావెక్కింది కూడా. సో.. ఇల్లీ బేబి సెకెండ్ ఇన్నింగ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.