కర్నూలులో రేవ్‌ పార్టీ…. డ్యాన్సర్లపై డీలర్ల దాడి

రేవ్‌ పార్టీ కల్చర్ కర్నూలుకు పాకింది. దీపావళి సందర్భంగా ఒక ఫర్టిలైజర్‌ సంస్థ తమ డీలర్లకు రేవ్ పార్టీ ఇచ్చింది. నగరంలోని కల్లూరు ఫంక్షన్‌ హాల్‌లో దీన్ని నిర్వహించారు. పార్టీలో అమ్మాయిలతో అర్థనగ్న నృత్యాలు వేయించారు. డీలర్లు తాగి తందనాలు ఆడారు.

బాగా తాగి కంట్రోల్ తప్పిన డీలర్లు కొందరు డ్యాన్సర్లతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దాంతో డీలర్లకు, డ్యాన్సర్లకు మధ్య గొడవ జరిగింది. ఫర్టిలైజర్ కంపెనీ ప్రతినిధులు జోక్యం చేసుకుని వివాదం పెద్దది కాకుండా చూశారు. నగరంలో ఇలాంటి పార్టీ జరుగుతున్నా పోలీసులు సకాలంలో గుర్తించలేకపోయారు.

ఇటీవల కర్నూలులో ఫర్టిలైజర్ కంపెనీలు తమ డీలర్లకు పోటీ పడి ఇలాంటి పార్టీలు ఇస్తున్నాయి. భారీగా ఖర్చు చేస్తున్నాయి. ముంబై నుంచి అమ్మాయిలను రప్పించి డీలర్ల ముందు చిందులేయిస్తున్నారు. వీటిని ఆరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న అభిప్రాయం ఉంది.