బాబు అంటే ఏంటో…. పవన్ కు ఇప్పుడు తెలుస్తోందా?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతాడు…. అభూత కల్పనలతో మాట్లాడతాడు. తన విషయంలో అయినా ప్రత్యర్థుల విషయంలో అయినా బాబు ఇలా వ్యవహరిస్తూ ఉంటాడు. బాబు పచ్చి అవకాశవాది.. ఈ మాటలన్నీ ఇప్పుడు పవన్ కల్యాణ్ నోటి వెంట వస్తున్నాయి. బాబు తీరును తప్పు పడుతూ పవన్ కల్యాణ్ విరుచుకుపడుతూ ఉన్నాడు.

అలాగే బాబుకు ఉన్న అనుకూల మీడియా అంశం గురించి కూడా పవన్ వాపోతున్నాడు. ఎలక్ట్రానిక్ మీడియాలో చంద్రబాబుకు పట్టు ఉందని.. బాబు అనుకున్నది, బాబుకు అనుకూలమైనది మాత్రమే సదరు మీడియా వర్గాల్లో వార్తలుగా వస్తాయని.. జనసేనకు సంబంధించిన వార్తలు కూడా బాబు ఇష్టాన్ని బట్టి ప్రసారం అవుతాయని పవన్ అంటున్నాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇదంతా కొత్త అయినట్టుగా పవన్ మాట్లాడుతూ ఉండటం. చంద్రబాబు తీరే అంత. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఆంధ్రా, తెలంగాణ అని తేడా లేకుండా అందరికీ ఈ విషయంలో అవగాహన ఉంది.

బాబు అలా అడ్డగోలుగా వ్యవహరిస్తాడని, అవకాశవాదిలా ప్రవర్తిస్తాడని తెలుగు రాజకీయాలను గమనించే వాళ్లందరికీ తెలుసు. పవన్ మాత్రం ఇప్పుడు ఈ విషయంలో వాపోతూ ఉన్నాడు.

అంటే.. ఇన్నాళ్లూ బాబుతో పవన్ కల్యాణ్ సన్నిహితంగా ఉన్నప్పుడు ఈ విషయాలు పవన్ కు తెలియదా? ఇన్ని రోజులూ బాబు తన గురించి పాజిటివ్ గా మాట్లాడాడు అంటే.. తను సపోర్ట్ చేస్తున్నందుకే అని పవన్ కి తెలియదా? తన గురించి బాబు అనుకూల మీడియా సానుకూలంగా చూపించిందంటే దానికంతా కారణం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నందుకే అని పవన్ కు ఇప్పటికి అర్థమైందా? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.