Telugu Global
NEWS

ఆ లిస్ట్ ఫేక్ " ఉత్తమ్‌

ఎన్నికలకు మరో నెల కూడా సమయం లేదు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్‌ తన అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. మహాకూటమిలోని మిత్రపక్షాలను సుతిమెత్తగా బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. కొందరు సీనియర్లు తమ వారసులకు కూడా  టికెట్లు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వారికి సర్ది చెప్పేందుకు ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లంతా ప్రచారం కూడా పక్కన పెట్టి ఢిల్లీలో రాహుల్‌ ఇంటి వద్ద ఉత్కంఠగా కాపు కాస్తున్నారు. ఇంతలో కొన్ని టీవీ చానళ్లు కాంగ్రెస్‌ జాబితా […]

ఆ లిస్ట్ ఫేక్  ఉత్తమ్‌
X

ఎన్నికలకు మరో నెల కూడా సమయం లేదు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్‌ తన అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. మహాకూటమిలోని మిత్రపక్షాలను సుతిమెత్తగా బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. కొందరు సీనియర్లు తమ వారసులకు కూడా టికెట్లు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వారికి సర్ది చెప్పేందుకు ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లంతా ప్రచారం కూడా పక్కన పెట్టి ఢిల్లీలో రాహుల్‌ ఇంటి వద్ద ఉత్కంఠగా కాపు కాస్తున్నారు. ఇంతలో కొన్ని టీవీ చానళ్లు కాంగ్రెస్‌ జాబితా తమ చేతికి వచ్చిందంటూ హడావుడి మొదలు పెట్టాయి. టీవీ చానళ్లు ప్రసారం చేసిన జాబితాలో తమ పేరు లేకపోవడంతో కొందరు కాంగ్రెస్‌ నేతలు కంగుతిన్నారు. పార్టీ పెద్దలను ప్రశ్నించడం మొదలుపెట్టారు.

ఈనేపథ్యంలో ప్రచారంలో ఉన్న జాబితాపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేస్తున్న జాబితాను నమ్మవద్దని సూచించారు. చానళ్ల ప్రసారం చేస్తున్న జాబితాలో నిజం లేదన్నారు. ఇప్పటికీ ఎలాంటి జాబితా సిద్దం కాలేదని చెప్పారు. మహాకూటమి అభ్యర్థుల జాబితాపై సంప్రదింపులు, చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. రేపు అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు.

First Published:  7 Nov 2018 11:45 PM GMT
Next Story