Telugu Global
Cinema & Entertainment

"టాక్సీ వాలా"లో నటించేందుకు ఇష్టపడని విజయ్ ?

 విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా “టాక్సీ వాలా”. ఈ సినిమా నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ టీవి ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఈ సినిమాలో నటించకూడదని విజయ్ స్ట్రాంగ్ గా అనుకున్నాడట. ఈ విషయం గురించి విజయ్ మాట్లాడుతూ “పెళ్లి చూపులు సినిమా అయిపోగానే నాకు యువి క్రియేషన్స్ నుంచి ఒక కథ వినమని […]

టాక్సీ వాలాలో నటించేందుకు ఇష్టపడని విజయ్ ?
X

విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా “టాక్సీ వాలా”. ఈ సినిమా నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ టీవి ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

అయితే ఈ సినిమాలో నటించకూడదని విజయ్ స్ట్రాంగ్ గా అనుకున్నాడట. ఈ విషయం గురించి విజయ్ మాట్లాడుతూ “పెళ్లి చూపులు సినిమా అయిపోగానే నాకు యువి క్రియేషన్స్ నుంచి ఒక కథ వినమని కాల్ వచ్చింది. నేను వెంటనే ఆఫీస్ కి వెళ్తే అక్కడ డైరెక్టర్ రాహుల్ నాకు కథ చెప్పడం స్టార్ట్ చేసాడు. కథ స్టార్టింగ్ లోనే ఇదొక హార్రర్ సినిమాని అని రాహుల్ చెప్పడంతో వెంటనే నా వల్ల హారర్ సినిమాలు అస్సలు కావు అని చెప్పి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాను… కానీ ఆతరువాత కథ మొత్తం విన్న నాకు బాగా నచ్చి సినిమా ఓకే చేశాను” అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. యువి క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాని రాహుల్ సంకిర్త్యన్ డైరెక్ట్ చేసాడు.

First Published:  8 Nov 2018 1:35 AM GMT
Next Story