Telugu Global
Cinema & Entertainment

అది ఓఎల్ఎక్స్ లో కొన్న కారు

సెకెండ్ హ్యాండ్ వస్తువులు కావాలంటే ఓఎల్ఎక్స్ లో వెదకాల్సిందే. కానీ ఓ సినిమా కోసం ఇలా వెదికి మరీ సెకెండ్ హ్యాండ్ కారు కొంటారని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు. కానీ టాక్సీవాలాలో మనం చూస్తున్న కారు సెకెండ్ హ్యాండ్ కారే. ఈ విషయాన్ని హీరో విజయ్ దేవరకొండ స్వయంగా  బయటపెట్టాడు. “ఓ డిఫెరెంట్, పురాతనమైన కారు కోసం చూశాం. చాలా చోట్ల వెదికాం దొరకలేదు. చివరికి ఓఎల్ఎక్స్ లో దొరికింది. వెంటనే కొనేశాం. అప్పటికే ఆ […]

అది ఓఎల్ఎక్స్ లో కొన్న కారు
X

సెకెండ్ హ్యాండ్ వస్తువులు కావాలంటే ఓఎల్ఎక్స్ లో వెదకాల్సిందే. కానీ ఓ సినిమా కోసం ఇలా వెదికి మరీ సెకెండ్ హ్యాండ్ కారు కొంటారని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు. కానీ టాక్సీవాలాలో మనం చూస్తున్న కారు సెకెండ్ హ్యాండ్ కారే. ఈ విషయాన్ని హీరో విజయ్ దేవరకొండ స్వయంగా బయటపెట్టాడు.

“ఓ డిఫెరెంట్, పురాతనమైన కారు కోసం చూశాం. చాలా చోట్ల వెదికాం దొరకలేదు. చివరికి ఓఎల్ఎక్స్ లో దొరికింది. వెంటనే కొనేశాం. అప్పటికే ఆ కారుకు 3 సార్లు రిపేర్లు చేయించాం. అయినప్పటికీ షూటింగ్ టైమ్ లో అది మాకు చుక్కలు చూపించింది. ఒకసారైతే ఈ కారు రిపేర్ వల్ల టోటల్ షూటింగే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అందులో ఏసీ ఉండదు. మిట్టమధ్యాహ్నం షూటింగ్ పెట్టారు.”

ఇలా ఆ కారుతో తన అనుభవాల్ని పంచుకున్నాడు విజయ్ దేవరకొండ. మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. దానికి ఒక డోర్ మాత్రమే పనిచేస్తుందట. అందరూ ఆ డోర్ నుంచే కారులోకి ఎక్కాలి. ఇవన్నీ ఒకెత్తయితే, మధ్యలో ఆ కారు పనికిరాకుండా పోయింది. అలాంటిదే మరో కారు వెదికి కొనేసరికి యూనిట్ కు తలప్రాణం తోకకొచ్చింది. ఇలా ఈ కారుకు చాలా ప్రత్యేకతలున్నాయంటున్నాడు విజయ్ దేవరకొండ. సినిమా షూటింగ్ అయిపోవడంతో, ఆ కారును గీతాఆర్ట్స్ ఆఫీస్ లోనే పక్కన పడేశారట.

First Published:  8 Nov 2018 6:23 AM GMT
Next Story