Telugu Global
NEWS

అయిపోయిన పెళ్ళికి ముహూర్తం పెడతాడట

ఇలాంటి ట్రిక్స్ తెలుగుదేశం పార్టీకి, టీడీపీ అనుకూల మీడియాకు కొత్త కాదు. వారి చరిత్ర అంతా ఇలానే ఉంటుంది. క్రెడిట్ కోసం పాకులాడటం కూడా బాబుకు అలవాటే. నా కోడి కూస్తే గాని తెల్లవారదు అనుకునే మనస్థత్వం చంద్రబాబుది. ఈ పరంపరలో మరో అధ్యాయం షురూ అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యతిరేక కూటమిని రూపొందిస్తున్నాడు అనే క్రెడిట్ కోసం పాకులాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఏర్పడిన యూపీఏ కూటమిని తనే ఏర్పాటు చేశాను అనేంతలా బాబు […]

అయిపోయిన పెళ్ళికి ముహూర్తం పెడతాడట
X

ఇలాంటి ట్రిక్స్ తెలుగుదేశం పార్టీకి, టీడీపీ అనుకూల మీడియాకు కొత్త కాదు. వారి చరిత్ర అంతా ఇలానే ఉంటుంది. క్రెడిట్ కోసం పాకులాడటం కూడా బాబుకు అలవాటే. నా కోడి కూస్తే గాని తెల్లవారదు అనుకునే మనస్థత్వం చంద్రబాబుది. ఈ పరంపరలో మరో అధ్యాయం షురూ అయ్యింది.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యతిరేక కూటమిని రూపొందిస్తున్నాడు అనే క్రెడిట్ కోసం పాకులాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఏర్పడిన యూపీఏ కూటమిని తనే ఏర్పాటు చేశాను అనేంతలా బాబు కలరింగ్ ఇచ్చుకొంటూ ఉన్నాడు. బాబు ఇలా పాకులాడుతూ ఉంటే… దానికి ఆయన అనుకూల మీడియా వంత పాట పాడుతోంది.

ఎన్డీయే అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా…. దానికి వ్యతిరేకంగా యూపీఏ అనే కూటమి ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అది కొనసాగుతూ ఉంది. దాదాపు ఒకటిన్నర దశాబ్దం నుంచి యూపీఏ రూపంలో ఒక కూటమి బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. అది రెండు సార్లు అధికారాన్ని సొంతం చేసుకుంది కూడా. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. బీజేపీ వైరి పక్షంలోని చాలా పార్టీలు ఆ కూటమిలో ఉన్నాయి.

దీని యాక్టివిటీస్ కూడా ఎంతో కాలం నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ఆ పార్టీల నేతలు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలు చేపట్టారు వాళ్లంతా. వాళ్లలోకి కొత్తగా ఇప్పుడు వచ్చి కలిశాడు చంద్రబాబు నాయుడు.

అయితే చంద్రబాబు నాయుడు ట్రిక్స్ మాత్రం మరో రకంగా ఉన్నాయి. అవేమిటంటే…. ఆ కూటమిని తనే ఏర్పాటు చేశాను .. తన చొరవ వల్లనే ఆ కూటమి ఏర్పడింది అన్నట్టుగా బాబు ప్రచారం చేసుకొంటూ ఉన్నాడు. నిన్న జేడీఎస్ నేతలను కలిసిన చంద్రబాబు, రేపు స్టాలిన్ ను కలుస్తాడట. అందరినీ ఏకం చేస్తా అని బాబు అంటున్నాడు.

ఆల్రెడీ వాళ్లంతా ఒక కూటమిలో కలిసి ఉంటే, మోడీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ ఉంటే ఇప్పుడు చంద్రబాబు కొత్తగా చేసేది ఏమిటో అర్థం కాని పరిస్థితి. జనాలను వెర్రి వాళ్లను చేస్తూ చంద్రబాబు ఇలాంటి రాజకీయం చేస్తున్నాడు. మొత్తం పరిణామాలను గమనిస్తున్న వాళ్లు మాత్రం బాబు కామెడీని చూసి నవ్వుకుంటున్నారు.

First Published:  9 Nov 2018 9:00 AM GMT
Next Story