Telugu Global
NEWS

74 మందితో 10న కాంగ్రెస్ లిస్ట్ ! 19 సీట్లు పెండింగ్ ?

తెలంగాణలోని 119 సీట్లలో 25కి పైగా సీట్లు మిత్రప‌క్షాల‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 74 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 19 సీట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. టిడిపికి 14, టిజెఎస్ కు 8, సిపిఐ కి 3 సీట్లు కేటాయించారు. ఒక స్థానం ఇంటి పార్టీకి కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కు నకిరేకల్ […]

74 మందితో 10న కాంగ్రెస్ లిస్ట్ ! 19 సీట్లు పెండింగ్ ?
X

తెలంగాణలోని 119 సీట్లలో 25కి పైగా సీట్లు మిత్రప‌క్షాల‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 74 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 19 సీట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది.

టిడిపికి 14, టిజెఎస్ కు 8, సిపిఐ కి 3 సీట్లు కేటాయించారు. ఒక స్థానం ఇంటి పార్టీకి కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కు నకిరేకల్ సీటు ఇచ్చే అవకాశం ఉంది.

119 స్థానాలకు ఒకే సారి అభ్యర్దుల్ని ప్రకటించాలని కాంగ్రెస్ నేత‌లు ముందు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అన్ని స్థానాలకు ఒకే సారి అభ్య‌ర్థుల‌ను ప్రకటించలేకపోతున్న‌ట్లు తెలిసింది. 10 వ తేదీన ఉదయం 74 మంది అభ్యర్దుల్ని ప్రకటించనున్నారు.

వ్యూహాత్మకంగా ఆపిన సీట్లు

1.మేడ్చల్
2. మంచిర్యాల
3.సూర్యాపేట
4. ఇల్లందు
5. కొత్తగూడెం
6.నకిరేకల్
7. నాగర్ కర్నూల్
8.తుంగతుర్తి
9. సికింద్రాబాద్
10. వికారాబాద్
11. మహబూబ్ నగర్
12.దేవరకొండ
13. వరంగల్
14. ములుగు
15. మెదక్
16. పాలకుర్తి
17. భద్రాచలం
18. ఇబ్రహీంపట్నం
19. నారాయణఖేడ్

First Published:  8 Nov 2018 7:52 PM GMT
Next Story