Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి కోసం బాలీవుడ్ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన కొరటాల శివ?

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం “సై రా నరసింహారెడ్డి” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ముహూర్తం పెట్టాడు చిరంజీవి. డిసెంబర్ లో గాని జనవరి లో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సినిమా కోసం మొదట హీరోయిన్ గా అనుష్క ని అనుకున్నారు. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు గాని ఈ సినిమా కోసం […]

చిరంజీవి కోసం బాలీవుడ్ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన కొరటాల శివ?
X

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం “సై రా నరసింహారెడ్డి” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ముహూర్తం పెట్టాడు చిరంజీవి. డిసెంబర్ లో గాని జనవరి లో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

అయితే ఈ సినిమా కోసం మొదట హీరోయిన్ గా అనుష్క ని అనుకున్నారు. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు గాని ఈ సినిమా కోసం ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హ్యుమా ఖురేషి ని అనుకుంటున్నాడట కొరటాల శివ. ఎందుకంటే కథ పరంగా చూసుకుంటే చిరంజీవి ఏజ్ కి తగ్గట్టు గా వ్యవహరించే హీరోయిన్ కావాలట. అందుకే హ్యుమా ఖురేషి ని సెలెక్ట్ చేసాడట కొరటాల శివ.

రజనీకాంత్ సరనస “కాలా” సినిమాలో నటించిన హ్యుమా ఖురేషి ఇప్పుడు చిరంజీవితో నటించడానికి సిద్దం అవుతుంది.

First Published:  9 Nov 2018 6:43 AM GMT
Next Story