Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు కోసం కష్టపడుతున్న నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు “శ్రీమంతుడు” సినిమాతో నిర్మాతగా మారాడు. మహేష్ బాబు నటుడిగానే కాకుండా వ్యాపారాలు, యాడ్ ఫిలిమ్స్, బ్రాండ్ ఎండోర్స్ మెంట్ లు వంటివి చేస్తున్నాడు. అయితే ”ఎంబి” అనే తన సొంత బ్యానర్ లో కొన్ని మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు. అయితే ఈ బ్యానర్ లో తన సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా చేయాలనేది మహేష్ బాబు ప్లాన్. మహేష్ బాబు తన సినిమాలతో […]

మహేష్ బాబు కోసం కష్టపడుతున్న నమ్రత
X

సూపర్ స్టార్ మహేష్ బాబు “శ్రీమంతుడు” సినిమాతో నిర్మాతగా మారాడు. మహేష్ బాబు నటుడిగానే కాకుండా వ్యాపారాలు, యాడ్ ఫిలిమ్స్, బ్రాండ్ ఎండోర్స్ మెంట్ లు వంటివి చేస్తున్నాడు. అయితే ”ఎంబి” అనే తన సొంత బ్యానర్ లో కొన్ని మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు.

అయితే ఈ బ్యానర్ లో తన సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా చేయాలనేది మహేష్ బాబు ప్లాన్. మహేష్ బాబు తన సినిమాలతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ పనులు తన భార్య నమ్రత చూసుకుంటోంది. ఇకపై చిన్న సినిమాలు, డిఫరెంట్ సినిమాలు నిర్మించాలని ఆలోచిస్తున్నారట. సరైన కథలు, కాస్త ప్రామిసింగ్ గా ఉండే చిన్న డైరెక్టర్స్ కోసం చూస్తున్నారట. రెండు, మూడు కోట్ల లోపు అయిపోయే సినిమాలు తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇందుకోసం ఇప్పటి నుంచే కొంత మంది మేకర్స్ ని తీసుకొని వారి చేత కథలు కూడా రాయిస్తుందట నమ్రత. దాంట్లో ఏ కథ సెట్ అయితే ఆ కథతో ఈ బ్యానర్ లో మొదటి చిన్న సినిమా స్టార్ట్ చెయ్యాలి అనేది నమ్రత ప్లాన్. మొత్తానికి మహేష్ బాబుని నిర్మాతగా నిలబెట్టాలని నమ్రత బాగా ట్రై చేస్తుందన్నమాట.

First Published:  8 Nov 2018 11:30 PM GMT
Next Story