Telugu Global
Cinema & Entertainment

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ మొదటి రోజు వసూళ్లు

అట్టర్ ఫ్లాప్ అయిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా వసూళ్లలో మాత్రం ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 6వేల స్క్రీన్స్ పై విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు వసూళ్లలో బాహుబలి-2ను అధిగమించింది. దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఈ సినిమాకు 49 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. గతంలో బాహుబలి-2కు విడుదలైన మొదటి రోజు 40 కోట్ల 73 లక్షల రూపాయల నెట్ వచ్చింది. బాహుబలి-2 సినిమా 5వేల స్క్రీన్స్ పై విడుదలైంది. అమీర్ ఖాన్, బిగ్ బి అమితాబ్ […]

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ మొదటి రోజు వసూళ్లు
X

అట్టర్ ఫ్లాప్ అయిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా వసూళ్లలో మాత్రం ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 6వేల స్క్రీన్స్ పై విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు వసూళ్లలో బాహుబలి-2ను అధిగమించింది. దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఈ సినిమాకు 49 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. గతంలో బాహుబలి-2కు విడుదలైన మొదటి రోజు 40 కోట్ల 73 లక్షల రూపాయల నెట్ వచ్చింది. బాహుబలి-2 సినిమా 5వేల స్క్రీన్స్ పై విడుదలైంది.

అమీర్ ఖాన్, బిగ్ బి అమితాబ్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే భారీస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో మొదటి రోజు వసూళ్లలో రికార్డు సృష్టించింది అమీర్ సినిమా. ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు (నెట్) ఇలా ఉన్నాయి.

ముంబయి – రూ. 15.63 కోట్లు

ఢిల్లీ/ఉత్తర్ ప్రదేశ్ – రూ. 10.58 కోట్లు

ఈస్ట్ పంజాబ్ – రూ. 4.82 కోట్లు
రాజస్థాన్ – రూ. 2.87 కోట్లు
మహారాష్ట్ర – రూ. 2.57 కోట్లు
సెంట్రల్ ఇండియా – రూ. 1.74 కోట్లు
నైజాం/ఆంధ్ర – రూ. 2.76 కోట్లు
మైసూర్ – రూ. 2.88 కోట్లు
బెంగాల్ – – రూ. 2.08 కోట్లు
బిహార్/జార్ఖండ్ – రూ. 1.35 కోట్లు
అస్సాం – రూ. 0.53 కోట్లు
ఒడిశా – రూ. 0.57 కోట్లు

First Published:  9 Nov 2018 9:21 AM GMT
Next Story