Telugu Global
Cinema & Entertainment

మరోసారి వైరల్ అయిన నయనతార

ఈ ముద్దుగుమ్మ సినిమాలతో ఎంత పాపులర్ అయిందో, వ్యక్తిగత జీవితంతో కూడా అంతే పాపులర్ అవుతోంది. దీనికి కారణం దర్శకుడు విఘ్నేష్ శివన్. వీళ్లిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఏకంగా విదేశీ పర్యటనలు కూడా కలిసి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ మధ్య బంధాన్ని మరోసారి బయటపెట్టే ప్రయత్నం చేశారు నయన్-విఘ్నేష్. కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది కోలీవుడ్ ప్రముఖులు కలిసి చెన్నైలో నిన్న దీపావళి పార్టీ చేసుకున్నారు. కలిసి లంచ్ చేశారు. ఈ […]

మరోసారి వైరల్ అయిన నయనతార
X

ఈ ముద్దుగుమ్మ సినిమాలతో ఎంత పాపులర్ అయిందో, వ్యక్తిగత జీవితంతో కూడా అంతే పాపులర్ అవుతోంది. దీనికి కారణం దర్శకుడు విఘ్నేష్ శివన్. వీళ్లిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఏకంగా విదేశీ పర్యటనలు కూడా కలిసి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ మధ్య బంధాన్ని మరోసారి బయటపెట్టే ప్రయత్నం చేశారు నయన్-విఘ్నేష్. కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు.

కొంతమంది కోలీవుడ్ ప్రముఖులు కలిసి చెన్నైలో నిన్న దీపావళి పార్టీ చేసుకున్నారు. కలిసి లంచ్ చేశారు. ఈ వేడుకలో నయనతార, విఘ్నేష్ శివన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీళ్లిద్దరూ కలిసి దిగిన సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజానికి ఇదే పార్టీలో హీరో శివ కార్తికేయన్, మరో దర్శకుడు అట్లీ, సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా ఉన్నారు. కానీ వాళ్ల ఫొటోల కంటే నయన్-విఘ్నేష్ తీసుకున్న సెల్ఫీలే ఎక్కువ వైరల్ అయ్యాయి. నిజానికి వీళ్లిద్దరూ కలిసి ఇలా సెల్ఫీలు దిగడం కొత్తేంకాదు. గూగుల్ లో కొడితే చాలా ఫొటోలు ప్రత్యక్షమౌతాయి. కానీ ఈ జంటకు ఉన్న క్రేజ్ కారణంగా మరోసారి వైరల్ అయ్యాయి.

అంతా బాగానే ఉంది కానీ తమ బంధాన్ని మాత్రం వీళ్లలో ఏ ఒక్కరూ బయటపెట్టడం లేదు. కోలీవుడ్ జనాలతో పాటు ప్రేక్షకులందరికీ వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం తెలుసు. కానీ ఆ విషయాన్ని వీళ్లు బయటకు చెప్పరు. ఒకేసారి ఏకంగా పెళ్లి తేదీతో బయటకొస్తారేమో.

First Published:  8 Nov 2018 10:12 PM GMT
Next Story