Telugu Global
Cinema & Entertainment

దూసుకుపోతున్న రామ్ చరణ్ టీజర్

బోయపాటి డైరక్షన్ లో వినయ విధేయ రామ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు టీజర్ విడుదల చేశారు. విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ అనే తేడా లేకుండా అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ టీజర్ దే హవా. ఇప్పటివరకు ఈ టీజర్ కు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అన్ని సామాజిక మాధ్యమాల్లో […]

దూసుకుపోతున్న రామ్ చరణ్ టీజర్
X

బోయపాటి డైరక్షన్ లో వినయ విధేయ రామ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు టీజర్ విడుదల చేశారు. విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ అనే తేడా లేకుండా అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ టీజర్ దే హవా.

ఇప్పటివరకు ఈ టీజర్ కు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అన్ని సామాజిక మాధ్యమాల్లో కలుపుకొని ఇంత రీచ్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. 24 గంటలు గడిచేసరికి సౌత్ లో సరికొత్త రికార్డు దిశగా ఈ టీజర్ దూసుకుపోయే ఛాన్స్ ఉంది.

ఇక టీజర్ విషయానికొస్తే, కంప్లీట్ గా బోయపాటి శ్రీను స్టయిల్ లో ఉంది టీజర్. ఇంతకుముందు విడుదలైన ఫస్ట్ లుక్ లో కూడా తన మార్క్ చూపించిన బోయపాటి, ఈసారి టీజర్ లో కూడా అదే మాస్ ఎలిమెంట్స్ ను చూపించాడు. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు మరింత లుక్ తీసుకొచ్చింది.

First Published:  9 Nov 2018 9:12 AM GMT
Next Story