Telugu Global
Cinema & Entertainment

ఇక డైరెక్టర్ విశాల్

తెలుగు కుర్రాడు అయిన విశాల్ తమిళ సినిమాల్లో స్థిరపడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ యంగ్‌ హీరో ఇప్పుడు దర్శకత్వం వైపు టర్న్‌ అవుతున్నాడు. త్వరలోనే ఓ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడుట విశాల్. 2019 జనవరిలో తాను దర్శకత్వం వహించబోయే సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట విశాల్‌. ఇప్పటిదాకా నటుడిగా, నిర్మాతగా సినిమాలు చేసిన విశాల్‌… ఇకపై దర్శకత్వం చేస్తాననడం కొంచెం స్పెషల్. నిజానికి విశాల్‌ మొదట దర్శకుడు […]

ఇక డైరెక్టర్ విశాల్
X

తెలుగు కుర్రాడు అయిన విశాల్ తమిళ సినిమాల్లో స్థిరపడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ యంగ్‌ హీరో ఇప్పుడు దర్శకత్వం వైపు టర్న్‌ అవుతున్నాడు. త్వరలోనే ఓ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడుట విశాల్.

2019 జనవరిలో తాను దర్శకత్వం వహించబోయే సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట విశాల్‌. ఇప్పటిదాకా నటుడిగా, నిర్మాతగా సినిమాలు చేసిన విశాల్‌… ఇకపై దర్శకత్వం చేస్తాననడం కొంచెం స్పెషల్.

నిజానికి విశాల్‌ మొదట దర్శకుడు అవుదామనే అనుకున్నాడట. కానీ అనుకోకుండా హీరోగా నటించాల్సి వచ్చిందట. ఏ సినిమా చేసినా, ఆ సినిమా నిర్మాణం సమయంలో తనలోని దర్శకుడు అప్పుడప్పుడూ తనను డామినేట్‌ చేసేవాడనీ, సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ పై అవగాహన వచ్చాకే దర్శకత్వం చేద్దాం అని ఫిక్స్ అయ్యాడట.

ఇక ఇప్పుడు కొంచెం కాంఫిడెన్స్ వచ్చింది అని గ్రహించాక సినిమా డైరెక్ట్ చేద్దాం అని డిసైడ్ అయ్యాడట విశాల్. విశాల్ డైరెక్ట్ చేసే సినిమా…. తమిళ్ తో పాటు తెలుగు లో కూడా రిలీజ్ అవుతుందట.

First Published:  8 Nov 2018 11:18 PM GMT
Next Story