Telugu Global
Cinema & Entertainment

దేవరకొండ సెంటిమెంట్ ఫలిస్తుందా..?  

విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా వచ్చాడు. కట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం కూడా మరోసారి బన్నీనే ప్రత్యేక అతిథిగా తీసుకొస్తున్నారు. 11వ తేదీన జరగనున్న ఈ వేడుకలో అల్లు అర్జున్ మెరవబోతున్నాడు. సెంటిమెంట్ అనే విషయాన్ని పక్కనపెడితే, అటు గీతగోవింద, ఇటు టాక్సీవాలా సినిమాలు రెండూ అల్లు అరవింద్ వే. పైగా బన్నీ […]

దేవరకొండ సెంటిమెంట్ ఫలిస్తుందా..?   
X

విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా వచ్చాడు. కట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం కూడా మరోసారి బన్నీనే ప్రత్యేక అతిథిగా తీసుకొస్తున్నారు. 11వ తేదీన జరగనున్న ఈ వేడుకలో అల్లు అర్జున్ మెరవబోతున్నాడు.

సెంటిమెంట్ అనే విషయాన్ని పక్కనపెడితే, అటు గీతగోవింద, ఇటు టాక్సీవాలా సినిమాలు రెండూ అల్లు అరవింద్ వే. పైగా బన్నీ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. అందుకే టాక్సీవాలాకు కూడా కొడుకును తీసుకొస్తున్నాడు అరవింద్. అంతకుమించి ఇందులో సెంటిమెంట్స్ ఏమీ లేవు. కాకపోతే సినిమా జనాలకు ఈ విషయంలో పట్టింపు ఎక్కువ కాబట్టి, గీతగోవందం టైపులోనే టాక్సీవాలా కూడా హిట్ అయిపోతుందంటూ అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు.

ఈ సెంటిమెంట్స్ గోల కాసేపు పక్కనపెడితే, విజయ్ దేవరకొండకు మాత్రం టాక్సీవాలా సక్సెస్ అత్యవసరం. ఇప్పటికే నోటాతో బాగా దెబ్బతిన్నాడు ఈ హీరో. టాక్సీవాలా కూడా తుస్సుమంటే దేవరకొండ కథ మళ్లీ మొదటికొస్తుంది. అందుకే టాక్సీవాలా హిట్ అవ్వాలని కోటిదేవుళ్లకు మొక్కుతున్నాడు ఈ హీరో.

First Published:  9 Nov 2018 9:30 AM GMT
Next Story