Telugu Global
Family

నిజమైన భక్తుడు

అబూసరి బట్టలకొట్టు నడిపేవాడు. మార్కెట్‌ మధ్యలో అతని షాపు వుండేది. వచ్చీపోయే జనాలతో మార్కెట్‌ రద్దీగా వుండేది. సందడిగా వుండేది. అబూసరి షాపుకు జనాలు బాగా వచ్చే వాళ్ళు. వాళ్ళతో మాటలు కలిపి సరదాగా కబుర్లు చెబుతూ, అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ అబుసరి వ్యాపారం కొనసాగించేవాడు. అతనికి ఒంటరిగా వుండడం యిష్టముండదు. మనుషులతో గడపడమంటే అతనికి ఆనందం. తనకు అవసరమయిన బట్టలు యితర షాపుల వాళ్ళ దగ్గర కొంటూ, తన దగ్గరవున్న బట్టలు అమ్ముతూ బేరసారాలు […]

అబూసరి బట్టలకొట్టు నడిపేవాడు. మార్కెట్‌ మధ్యలో అతని షాపు వుండేది. వచ్చీపోయే జనాలతో మార్కెట్‌ రద్దీగా వుండేది. సందడిగా వుండేది. అబూసరి షాపుకు జనాలు బాగా వచ్చే వాళ్ళు. వాళ్ళతో మాటలు కలిపి సరదాగా కబుర్లు చెబుతూ, అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ అబుసరి వ్యాపారం కొనసాగించేవాడు. అతనికి ఒంటరిగా వుండడం యిష్టముండదు. మనుషులతో గడపడమంటే అతనికి ఆనందం. తనకు అవసరమయిన బట్టలు యితర షాపుల వాళ్ళ దగ్గర కొంటూ, తన దగ్గరవున్న బట్టలు అమ్ముతూ బేరసారాలు సాగించేవాడు.

కాని మధ్యాహ్నం అయ్యే సరికి షాపుకు తెరదించి ఒకమూల భక్తి శ్రద్ధలతో భగవంతున్ని ప్రార్థించేవాడు. మళ్ళీ తెరలేపి వ్యాపారం కొనసాగించేవాడు.

ఒకరోజు ఒక ముల్లా అబూసరి దగ్గరికి వచ్చి ‘నేను దేవుడికి చాలా దగ్గరవాణ్ణి. నా ఆనందాన్ని నీతో పంచుకోవడానికి సిద్ధంగా వున్నాను’ అన్నాడు.

అబూసరి ‘నువ్వెక్కడుంటావు?’ అని ముల్లాని అడిగాడు

ముల్లా ‘నేను ఎడారిలో వుంటాను. దైవచింతనలో గాఢంగా వుంటూ దేవుని ఆశీర్వాదాలలో తేలుతూవుంటాను’ అన్నాడు.

అబూసరి ‘నువ్వు ఎడారిలో నివసిస్తున్నావంటే నువ్వు యింకా స్వర్గానికి చాలా దూరంగా వున్నట్లే లెక్క. జ్ఞానోదయం పొందిన వ్యక్తి జనం మధ్య వుండాలి. ఒంటరిగా కాదు. ఎందుకంటే దేవుడు అందరిలోవాడు. అందరిలో వుండేవాడు. అందరిలో వుండే దేవుణ్ణి కాదని నువ్వు ఒంటరిగా వుంటే అందర్నీ వదిలి దేవుడు నీ ఒక్కడికోసం రాడు. యిక్కడ యింతమంది మధ్యలో వుంటే ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మనం వదిలి వుండం’ అన్నాడు.

ఆ మాటాలకు ముల్లా నిరుత్తరుడయ్యాడు.

– సౌభాగ్య

First Published:  10 Nov 2018 9:00 AM GMT
Next Story