Telugu Global
NEWS

ఏపీలో ఓట్ల కుంభకోణం.... 15 శాతం బోగస్‌

ఏపీలో ఓటర్ల జాబితా మొత్తం తప్పుల తడకగా ఉందని జనచైతన్య వేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో మాజీ సీఎస్‌లు అజేయ్ కల్లం, ఐవైఆర్‌ కృష్ణారావుతో కలిసి జనచైతన్య వేదిక సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి… లోపాలను సాక్ష్యలతో సహా ఎత్తి చూపారు. ఏపీలో దాదాపు 50 లక్షల ఓట్లు బోగస్‌ అని సాక్ష్యాలతో సహా వివరించింది జనచైతన్య వేదిక. మొత్తం ఓట్లలో ఏకంగా 15 శాతం బోగస్‌ ఓట్లు ఉన్నాయని లెక్కలను బయటపెట్టింది. 15 శాతం బోగస్‌ ఓట్లున్నప్పుడు […]

ఏపీలో ఓట్ల కుంభకోణం.... 15 శాతం బోగస్‌
X

ఏపీలో ఓటర్ల జాబితా మొత్తం తప్పుల తడకగా ఉందని జనచైతన్య వేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో మాజీ సీఎస్‌లు అజేయ్ కల్లం, ఐవైఆర్‌ కృష్ణారావుతో కలిసి జనచైతన్య వేదిక సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి… లోపాలను సాక్ష్యలతో సహా ఎత్తి చూపారు.

ఏపీలో దాదాపు 50 లక్షల ఓట్లు బోగస్‌ అని సాక్ష్యాలతో సహా వివరించింది జనచైతన్య వేదిక. మొత్తం ఓట్లలో ఏకంగా 15 శాతం బోగస్‌ ఓట్లు ఉన్నాయని లెక్కలను బయటపెట్టింది.

15 శాతం బోగస్‌ ఓట్లున్నప్పుడు ఎన్నికలు నిర్వహించడం వృథా అని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాలో ఏడాది, ఐదేళ్ల వయసు ఉన్న వారికి కూడా ఓటు హక్కు కల్పించారు. కొన్నిచోట్ల పలువురి ఓటర్ల వయసు 300 ఏళ్లు ఉన్నట్టు ఓటర్ల జాబితాలో ఉంది.

లక్షలాది మంది అటు తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు…. ఇటు ఏపీలోని వారు సొంతూర్లలో ఓటు హక్కు కలిగి ఉండడం కూడా జనచైతన్య వేదిక పరిశీలనలో వెలుగులోకి తెచ్చింది.

ఏపీలో మొత్తం బోగస్ ఓట్ల సంఖ్య – 52 లక్షలు

హైదరాబాద్‌లో ఒక ఓటు, ఏపీలో మరో ఓటు ఉన్న వారి సంఖ్య ఏకంగా 18 లక్షల 50 వేల 511గా ఉంది.
ఒకే వ్యక్తికి వివిధ ప్రాంతాల్లో వేరు వేరు ఓటర్ కార్డులతో ఓటు హక్కు ఉన్న వారు ఏకంగా 82వేల 788 మంది ఉన్నారు.
ఒకే వ్యక్తికి వయసు తేడాతో రెండు చోట్ల ఓటు హక్కు 24, 928 మందికి ఉంది.
ఒకే వ్యక్తి , ఒకే ఐడీ కార్డుతో రెండు చోట్ల ఓట్లు ఉన్న వారు 36, 404 మంది ఉన్నారు.
ఒకే వ్యక్తి జండర్‌ తేడాతో రెండు ఓట్లు ఉన్న వారి సంఖ్య వెయ్యికి పైగా ఉంది.
ఒక చోట తండ్రి పేరు, మరొక చోట భర్త పేరు వాడి రెండు చోట్ల ఓట్లు ఉన్న వారి సంఖ్య…. 92వేల 198గా ఉంది.

ఏపీలో 52 లక్షల నకిలీ ఓట్లు ఉండడం చూస్తుంటే…. 15 శాతం నకిలీ ఓట్లు ఉండడం బట్టి చూస్తుంటే…. ప్రజాస్వామ్యం ఆపదలో ఉన్నట్టు అనిపిస్తోందన్నారు జనచైతన్య వేదిక సభ్యుడు లక్ష్మణ్ రెడ్డి. అధికార పార్టీలు, అధికారులు కుమ్మక్కు అయి ఇలా బోగస్ ఓట్లను చేరిస్తే ఇక నిజాయితీగా ఎన్నికలు జరిగే అవకాశమే లేదన్నారు.

ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 26వేల నకిలీ ఓట్లు ఉన్నాయని లక్ష్మణ్ రెడ్డి వెల్లడించారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ భారీగా నకిలీ ఓట్లు చేరాయన్నారు లక్ష్మణ్‌ రెడ్డి.

ఓట్ల బోగస్‌పై ఈసీ వెంటనే స్పందించాలని ఐవైఆర్‌ డిమాండ్ చేశారు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌కు కొన్ని పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొందరు రెండు రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని అలాంటి వారి చర్యలను అడ్డుకోవాలని కోరారు.

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ స్థాయిలో బోగస్‌ ఓట్లను వెలికి తీసిన తర్వాత కూడా ఈసీ అలసత్వం వహించడం ఏమాత్రం సరికాదని మాజీ సీఎస్‌ అజయ్ కల్లం అభిప్రాయపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందని గుర్తు చేశారు.

ఇప్పుడు ఈ స్థాయిలో భారీగా బోగస్‌ ఓట్లు ఉంటే ఇక ఎన్నికలు నిర్వహించడంలో అర్థం లేదన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న 18 లక్షల మంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి… తిరిగి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటేస్తే ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడుంటుందని ప్రశ్నించారు.

First Published:  10 Nov 2018 4:24 AM GMT
Next Story