Telugu Global
NEWS

బాబు మళ్లీ దొరికిపోయాడు..!

తెలుగుదేశం అధినేత మాట మార్చడంలో తరచూ దొరికిపోతూ ఉంటాడు. బాబు మాట మార్చడం కొత్త ఏమీ లేదు. అందుకు సాక్షాలుగా పత్రికల్లోని వార్తలు, వీడియోలు బోలెడున్నాయి. ఒక అంశం అని కాదు.. ప్రతి అంశంలోనూ చంద్రబాబు నాయుడు మాట మార్చుతూ సాగిపోతూ ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఎన్ని రకాలుగా విమర్శించాడో తెలిసిన సంగతే. సోనియాను, రాహుల్ ను, కాంగ్రెస్ ను చంద్రబాబు నాయుడు బోలెడన్ని మాటలు అన్నాడు. సోనియా ”గాంధీ కాదు గాడ్సే” అని […]

బాబు మళ్లీ దొరికిపోయాడు..!
X

తెలుగుదేశం అధినేత మాట మార్చడంలో తరచూ దొరికిపోతూ ఉంటాడు. బాబు మాట మార్చడం కొత్త ఏమీ లేదు. అందుకు సాక్షాలుగా పత్రికల్లోని వార్తలు, వీడియోలు బోలెడున్నాయి. ఒక అంశం అని కాదు.. ప్రతి అంశంలోనూ చంద్రబాబు నాయుడు మాట మార్చుతూ సాగిపోతూ ఉన్నాడు.

గతంలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఎన్ని రకాలుగా విమర్శించాడో తెలిసిన సంగతే. సోనియాను, రాహుల్ ను, కాంగ్రెస్ ను చంద్రబాబు నాయుడు బోలెడన్ని మాటలు అన్నాడు. సోనియా ”గాంధీ కాదు గాడ్సే” అని కూడా అన్నాడు. మొన్నటి వరకూ కాంగ్రెస్ ను విమర్శిస్తూనే ఉన్నాడు. రాహుల్ ఏపీకి వచ్చినా చంద్రబాబు దాన్ని కూడా తప్పు పట్టాడు. విభజించి అన్యాయం చేసి.. వెక్కిరించడానికి వస్తున్నారా అని విరుచుకుపడ్డాడు.

వాటన్నింటికీ వీడియో, ఆడియో, పేపర్ క్లిప్స్ లు సాక్షాలుగా ఉన్నాయి. ఇక ప్రత్యేకహోదా విషయంలో కూడా బాబు బోలెడన్ని సార్లు మాటలు మార్చాడు. అందుకూ సాక్షాలున్నాయి.

ఈ పరంపరలో మరో అంశంలో కూడా బాబు దొరికిపోయాడు. అదే.. నోట్ల రద్దు అంశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నోట్ల రద్దును తీవ్రంగా తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. ఇది కూడా బాబు మాట మార్పే. గతంలో నోట్ల రద్దును చంద్రబాబు గట్టిగా సమర్థించాడు. నోట్ల రద్దు జరిగినప్పుడు దానికి అనుకూలంగా మాట్లాడాడు.

అలాగే ట్విట్టర్ లో కూడా బాబు అలాగే పోస్టు చేశాడు. ఇప్పుడేమో నోట్ల రద్దును తిడుతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు, వీడియోలు, పేపర్ క్లిప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు మరోసారి ఇలా దొరికాడు!

First Published:  9 Nov 2018 8:42 PM GMT
Next Story