Telugu Global
NEWS

మేం తొలి నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్నాంగా.... స్టాలిన్‌ రియాక్షన్‌తో ఇబ్బందిపడ్డ బాబు

చంద్రబాబు ఇటీవల వరుసగా ఇతర రాష్ట్రాల ప్రాంతీయ నేతలను కలుస్తున్నారు. అదే సమయంలో జాతీయ మీడియా పట్టించుకోకపోయినా ఏపీలో బాబు మీడియా మాత్రం ఏపీ సీఎం పర్యటనకు తెగ హడావుడి చేస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను చంద్రబాబు ఏకతాటిపైకి తెస్తున్నారని ఊదరగొడుతోంది. తెలివిగా ఒక విషయాన్ని మాత్రం దాస్తూ వస్తోంది టీడీపీ మీడియా. ఇప్పటి వరకు చంద్రబాబు కలిసిన ప్రాంతీయ నేతలంతా చంద్రబాబు కంటే ముందే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి పోరాడుతున్న […]

మేం తొలి నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్నాంగా.... స్టాలిన్‌ రియాక్షన్‌తో ఇబ్బందిపడ్డ బాబు
X

చంద్రబాబు ఇటీవల వరుసగా ఇతర రాష్ట్రాల ప్రాంతీయ నేతలను కలుస్తున్నారు. అదే సమయంలో జాతీయ మీడియా పట్టించుకోకపోయినా ఏపీలో బాబు మీడియా మాత్రం ఏపీ సీఎం పర్యటనకు తెగ హడావుడి చేస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను చంద్రబాబు ఏకతాటిపైకి తెస్తున్నారని ఊదరగొడుతోంది. తెలివిగా ఒక విషయాన్ని మాత్రం దాస్తూ వస్తోంది టీడీపీ మీడియా. ఇప్పటి వరకు చంద్రబాబు కలిసిన ప్రాంతీయ నేతలంతా చంద్రబాబు కంటే ముందే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి పోరాడుతున్న వారే.

ఇప్పటి వరకు చంద్రబాబు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌, జేడీఎస్‌ కుమారస్వామి, డీఎంకే నేత స్టాలిన్‌లను కలిశారు. అయితే వీరంతా బాబు కంటే ముందే కాంగ్రెస్‌ పట్ల సానుకూలంగా, బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న వారే. చంద్రబాబు కొన్ని నెలల క్రితమే మోడీతో విడాకులు తీసుకుని కాంగ్రెస్‌తో కాపురంలోకి అడుగుపెట్టారు గానీ… మిగిలిన ప్రాంతీయ పార్టీల నేతలంతా దశాబ్ధాలుగా బీజేపీతో ఫైట్ చేస్తున్న వారే.

అలాంటి నేతలను కొత్త కోడి లాంటి చంద్రబాబు కలవడం, తిరిగి వారందరినీ బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబే ఏకం చేస్తున్నారని తెలుగు మీడియా ప్రచారం చేయడం చూసి అమాయకులు అబ్బురపడుతున్నారే గానీ… కాస్త వ్యవహారం తెలిసిన వారు మాత్రం బాబు మీడియా విన్యాసాలు చూసి అవ్వా… అని నోరు బాదుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న స్టాలిన్‌ను చంద్రబాబు కలిశారు. ఆ సమయంలో ఆసక్తికరమైన సంఘటన జరిగినట్టు డీఎంకే నేతలు చెబుతున్నారు.

స్టాలిన్‌తో భేటీ అయిన చంద్రబాబు మనమంతా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి… అని తనదైన ఇంగ్లీష్‌లో పిలుపునిచ్చారట. ఇందుకు స్టాలిన్‌ సీరియస్‌గానే ” మేం ఇప్పుడే కాదు.. చాలా ఏళ్లుగా బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాంగా.. కాంగ్రెస్‌తో యూపీఏ హయాం నుంచి కలిసే ఉన్నాంగా” అని గుర్తు చేశారని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు తనదైన శైలిలో ఒక నవ్వు నవ్వి సరిపెట్టారని డీఎంకే నేతలు చెబుతున్నారు. చంద్రబాబు మాట తీరు చూస్తుంటే ఆయన అన్ని పార్టీలను బీజేపీకి వ్యతిరేకంగా కూడగట్టేందుకు వచ్చారా? లేక…. తనకు మద్దతుగా ఉండాల్సిందిగా కోరేందుకు వచ్చారా? అన్నది అర్థం కావడం లేదంటున్నారు.

First Published:  10 Nov 2018 12:29 AM GMT
Next Story