Telugu Global
NEWS

కోహ్లీ చేసిన ఆ వ్యాఖ్య‌ల్లో త‌ప్పులేదు

ఇండియ‌న్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్య‌లు దుమారాన్నిరేపాయి. కోహ్లీ వ్యాఖ్య‌లు త‌ప్పంటూ నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కోహ్లీ చేసిన వ్యాఖ్య‌ల్లో త‌న‌కు త‌ప్పేమీ క‌నిపించ‌డం లేదంటూ మ‌రో ఇండియన్ మాజీ క్రికెట‌ర్ కైఫ్ మద్ద‌తు ప‌లికారు. విరాట్ కోహ్లీ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల‌తో చిట్ చాట్ నిర్వ‌హించారు. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం చెప్పారు. అయితే ఓ అభిమాని నాకు విదేశీ క్రికెట‌ర్లు అంటే చాలా ఇష్టం అంటూ […]

కోహ్లీ చేసిన ఆ వ్యాఖ్య‌ల్లో త‌ప్పులేదు
X

ఇండియ‌న్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్య‌లు దుమారాన్నిరేపాయి. కోహ్లీ వ్యాఖ్య‌లు త‌ప్పంటూ నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కోహ్లీ చేసిన వ్యాఖ్య‌ల్లో త‌న‌కు త‌ప్పేమీ క‌నిపించ‌డం లేదంటూ మ‌రో ఇండియన్ మాజీ క్రికెట‌ర్ కైఫ్ మద్ద‌తు ప‌లికారు. విరాట్ కోహ్లీ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల‌తో చిట్ చాట్ నిర్వ‌హించారు. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం చెప్పారు.

అయితే ఓ అభిమాని నాకు విదేశీ క్రికెట‌ర్లు అంటే చాలా ఇష్టం అంటూ కోహ్లీకి పోస్ట్ చేశాడు. దీంతో అభిమాని చేసిన కామెంట్ల‌కు చిర్రెత్తిపోయిన కోహ్లీ నువ్వు ఇండియాలో ప‌నికిరావు. నీకు న‌చ్చిన దేశంలో వెళ్లి నువ్వు ఉండొచ్చు అంటూ రిప్ల‌యి ఇచ్చాడు. ఈ వ్యాఖ్య‌లే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. కోహ్లీ చేసిన వ్యాఖ్య‌లు త‌ప్పంటూ విమ‌ర్శిస్తుండ‌గా..మరికొంద‌రు కోహ్లికి దేశంపై ఉన్న ప్రేమ‌తో ఇలా మాట్లాడుతున్నార‌ని అంటున్నారు.

కానీ కోహ్లీ చేసిన వ్యాఖ్య‌ల్లో త‌ప్పులేదు. ఎందుకు భూత‌ద్ధంలో చూస్తున్నారు. ఎవ‌రిష్టం వారిది. గ‌తంలో కోహ్లీ విదేశీ క్రికెట‌ర్ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురింపించిన సంద‌ర్భాలు ఉన్నాయి. కావాల‌నే కొంత‌మంది అత‌నిని టార్గెట్ చేసేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారంటూ కైఫ్ మ‌ద్ద‌తు ప‌లికారు.

First Published:  9 Nov 2018 11:45 PM GMT
Next Story