Telugu Global
Cinema & Entertainment

నన్ను హోటల్ లో ఇబ్బంది పెట్టారు " రాధిక ఆప్టే

బాలీవుడ్ తార రాధిక ఆప్టే మరోసారి దక్షిణాది పరిశ్రమ మీద మరో సంచలన ఆరోపణ చేసింది. నెట్ ఫ్లిక్స్ తో పాటు పెద్ద పెద్ద స్టార్స్ తో హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రాధిక  తనకి దక్షిణ పరిశ్రమలో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఆడిషన్ కోసం అని ఒక దర్శకుడు తనని ఒక హోటల్ కి రమ్మని వివరాలు పంపాడట. “ఆడిషన్లు ఆఫీసులో జరుపుతారు కానీ హోటల్లో ఎందుకు చేస్తారు అని అనుమానం వచ్చినా కూడా […]

నన్ను హోటల్ లో ఇబ్బంది పెట్టారు  రాధిక ఆప్టే
X

బాలీవుడ్ తార రాధిక ఆప్టే మరోసారి దక్షిణాది పరిశ్రమ మీద మరో సంచలన ఆరోపణ చేసింది. నెట్ ఫ్లిక్స్ తో పాటు పెద్ద పెద్ద స్టార్స్ తో హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రాధిక తనకి దక్షిణ పరిశ్రమలో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది.

ఆడిషన్ కోసం అని ఒక దర్శకుడు తనని ఒక హోటల్ కి రమ్మని వివరాలు పంపాడట. “ఆడిషన్లు ఆఫీసులో జరుపుతారు కానీ హోటల్లో ఎందుకు చేస్తారు అని అనుమానం వచ్చినా కూడా దక్షిణాదికి నేను కొత్త అనుకొని ఇక్కడ అలాగే చేస్తారని వాళ్ళు చెప్పిన చోటికి వెళ్ళాను.

చూడలేనంత ఉండలేనంత భయంకరంగా కనిపిస్తున్న ఆ దర్శకుడు అతనితో పాటు కొంతమంది అక్కడ ఉండడంతో లోపలికి వెళ్ళాను. నా పాత్ర గురించి కానీ, కథ గురించి కానీ వివరాలు చెప్పకుండా కేవలం విక్రమ్ కథానాయకుడు అని చెప్పి నా పాత్ర డాన్స్ కు సంబంధించిన అని చెప్పి నా చేత చిందులు వేయించారు అలా చేస్తున్నప్పుడు నా ఫోటోలు తీసుకున్నారు. మరో వ్యక్తి వచ్చి కొన్ని బట్టలు చేతిలో పెట్టి ఫోటో షూట్ కోసం అవి వేసుకోమన్నాడు. ఇబ్బందికరంగా ఉన్న వేసుకుని చెప్పి తీసేద్దాం అనుకుని వేసుకుంటే, ఇద్దరు ముగ్గురు చేరి కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలతో ఏం చేశారో కూడా నాకు తెలీదు ఇంత జరిగాక ఉండలేక ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అతని ముఖాన్ని చూడలేదు. ఆ దర్శకుడు ఇంత వరకు సినిమా మొదలు కూడా పెట్టలేదు. ఇటువంటి అనుభవం తర్వాత మరోసారి ఇలాంటి ఇబ్బంది పడకూడదు అని నేను దక్షిణాదికి స్వస్తి చెప్పి వచ్చేసాను’ అని చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.

First Published:  9 Nov 2018 11:10 PM GMT
Next Story