Telugu Global
Cinema & Entertainment

తరుణ్ కి మరో అవకాశం ఇచ్చిన సురేష్ బాబు  

‘పెళ్లి చూపులు’ సినిమా తో జాతీయస్థాయి గుర్తింపు పొందిన తరుణ్  భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ ప్లాప్ తర్వాత ఎక్కడ  కనపడలేదు.  పెళ్లి చూపులతో విజయం, గుర్తింపే కాకుండా పురస్కారం కూడా అందుకున్న తరుణ్ అదే సంస్థ నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది’ లో తన శైలి భావాల్ని… హాస్యాన్ని పండించలేకపోయారు. “పెళ్లిచూపులు” తెచ్చిన గుర్తింపు మూడునాళ్ళ ముచ్చటగా మిగిలిపోతుందా అని మదన పడుతున్న దర్శకుడికి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మరోసారి  భరోసా ఇచ్చింది. ఒకటి కాదు […]

తరుణ్ కి మరో అవకాశం ఇచ్చిన సురేష్ బాబు    
X

‘పెళ్లి చూపులు’ సినిమా తో జాతీయస్థాయి గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ ప్లాప్ తర్వాత ఎక్కడ కనపడలేదు. పెళ్లి చూపులతో విజయం, గుర్తింపే కాకుండా పురస్కారం కూడా అందుకున్న తరుణ్ అదే సంస్థ నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది’ లో తన శైలి భావాల్ని… హాస్యాన్ని పండించలేకపోయారు. “పెళ్లిచూపులు” తెచ్చిన గుర్తింపు మూడునాళ్ళ ముచ్చటగా మిగిలిపోతుందా అని మదన పడుతున్న దర్శకుడికి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మరోసారి భరోసా ఇచ్చింది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు చిత్రాలు నిర్మిస్తానని మాట ఇచ్చింది అని సమాచారం. ఈ చిత్రాలకి తరుణ్ భాస్కర్ రచన, దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మాణ పనుల్లో కూడా పాల్గొంటున్నట్టుగా, మరోసారి అవకాశం ఇచ్చిన సంస్థకి గొప్ప చిత్రం తీయాలనే ఆలోచనతో పని చేస్తున్నానని భాస్కర్ తెలిపారు.

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం తనకి నిరాశ తో పాటు పాఠాలు కూడా నేర్పిందని, ఒక్క నిరాశ తన ప్రయాణాన్ని ఆపలేదని. తను నమ్మిన సంస్థకు గొప్ప ఖ్యాతిని తెచ్చే చిత్రాలు చేయాలి, అది తన బాధ్యతగా భావిస్తున్నట్టుగా తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.తను తీయబోతున్న ఈ చిత్రానికి కథ పనులు పూర్తయ్యాయని తారాగణం కోసం అన్వేషణ మొదలైంది తాజా సమాచారం.

First Published:  10 Nov 2018 12:32 PM GMT
Next Story