Telugu Global
NEWS

చిరు గుడ్‌బై.... ప్రస్తుతానికి మాత్రం....

ఏపీలో చంద్రబాబు పంచన చేరితే తమ పార్టీ బతుకుతుందని భావించిన కాంగ్రెస్‌కు ఫలితం ఎదురు తన్నుతోంది. ఆగర్భ శత్రువు టీడీపీతో పొత్తు అనగానే కాంగ్రెస్‌ సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్, వట్టి వసంత కుమార్, సి. రామచంద్రయ్య, బాలరాజు పార్టీని వీడారు. ఇప్పుడు ఏపీలో చెప్పుకొదగ్గ నేతలు వేళ్లమీద లెక్కించదగ్గ స్థాయిలో మాత్రమే ఉన్నారు. వారు కూడా టీడీపీతో పొత్తులో భాగంగా…. వారికి అవసరమైన లోక్‌సభ స్థానాలను కేటాయిస్తామని చంద్రబాబు […]

చిరు గుడ్‌బై.... ప్రస్తుతానికి మాత్రం....
X

ఏపీలో చంద్రబాబు పంచన చేరితే తమ పార్టీ బతుకుతుందని భావించిన కాంగ్రెస్‌కు ఫలితం ఎదురు తన్నుతోంది. ఆగర్భ శత్రువు టీడీపీతో పొత్తు అనగానే కాంగ్రెస్‌ సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్, వట్టి వసంత కుమార్, సి. రామచంద్రయ్య, బాలరాజు పార్టీని వీడారు. ఇప్పుడు ఏపీలో చెప్పుకొదగ్గ నేతలు వేళ్లమీద లెక్కించదగ్గ స్థాయిలో మాత్రమే ఉన్నారు.

వారు కూడా టీడీపీతో పొత్తులో భాగంగా…. వారికి అవసరమైన లోక్‌సభ స్థానాలను కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతోనే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు.

ఈ అంశంపై ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులతో చర్చలు జరిపారు. కొద్దిరోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. తనతో సహా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతల్లో ఏ ఒక్కరితోనూ కాంగ్రెస్‌ అధిష్టానం చర్చించకుండా టీడీపీతో పొత్తులకు సిద్ధపడటంపై చిరంజీవి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

కాంగ్రెస్‌ను వదిలేయడానికి ఇదే సరైన సమయం అని చిరంజీవి నిర్ధారణకు వచ్చారు. టీడీపీతో కాంగ్రెస్‌ కలవడం అనైతికమని చిరంజీవి గట్టిగా భావిస్తున్నారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన సన్నిహితులు తోసిపుచ్చుతున్నారు.

2014 ఎన్నికల సమయంలో కూడా చిరంజీవి కాంగ్రెస్‌లోనే కొనసాగారని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలని చిరంజీవి భావిస్తున్నట్లు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారు చెబుతున్నారు.

First Published:  10 Nov 2018 8:53 PM GMT
Next Story