Telugu Global
NEWS

ఏపీలో టీడీపీ నుంచి కాంగ్రెస్ కోరుతున్న సీట్లు ఇవే!

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పొత్తు ఏపీలో కూడా చూఛాయగా ఓకే అయినట్టుగా తెలుస్తోంది. మొన్నామధ్య చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడే.. టీడీపీ, కాంగ్రెస్ ల మధ్యన బంధం మరింత దృఢపడింది. రాహుల్ దర్శనం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ సమయంలో ఏపీలో కూడా టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తు ఉంటుందా? అంటే చంద్రబాబు డైరెక్టుగా సమాధానం ఇవ్వలేదు. చంద్రబాబు స్టైలే అంత. దేనికీ డైరెక్టు సమాధానాలు ఉండవు. అయితే ఏపీ టీడీపీ నేతలు మాత్రం.. ఇక్కడ మాత్రం […]

ఏపీలో టీడీపీ నుంచి కాంగ్రెస్ కోరుతున్న సీట్లు ఇవే!
X

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పొత్తు ఏపీలో కూడా చూఛాయగా ఓకే అయినట్టుగా తెలుస్తోంది. మొన్నామధ్య చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడే.. టీడీపీ, కాంగ్రెస్ ల మధ్యన బంధం మరింత దృఢపడింది. రాహుల్ దర్శనం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ సమయంలో ఏపీలో కూడా టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తు ఉంటుందా? అంటే చంద్రబాబు డైరెక్టుగా సమాధానం ఇవ్వలేదు.

చంద్రబాబు స్టైలే అంత. దేనికీ డైరెక్టు సమాధానాలు ఉండవు. అయితే ఏపీ టీడీపీ నేతలు మాత్రం.. ఇక్కడ మాత్రం పొత్తు ఉండదు అని ప్రచారం చేసుకున్నారు. తాము కాంగ్రెస్ తో చేతులు కలిపేది ఏపీ ఆవలే తప్ప ఏపీలో కాదు…. అని టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు.

అయితే అలాంటిది ఏమీ లేదు…. టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తు ఏపీలో కూడా ఉంటుందని స్పష్టం అవుతోంది. తాజాగా రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసిన నేపథ్యంలో…. ఏపీలో పొత్తు కూడా చర్చకు వచ్చిందని సమాచారం. తమకు కావాల్సిన సీట్ల జాబితాను చంద్రబాబుకు అందించాడట ఈ సీనియర్ కాంగ్రెస్ నేత.

ఆ జాబితాలో ఈ ఎంపీ స్థానాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. కర్నూలు, రాజంపేట, తిరుపతి, అరకు, కాకినాడ, విశాఖ ఎంపీ సీట్లు తమకు కావాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు చెప్పిందని సమాచారం. అలాగే పాతిక వరకూ ఎమ్మెల్యే సీట్ల పేర్లను కూడా చంద్రబాబుకు అందించిందట కాంగ్రెస్ పార్టీ.

ఈ విధంగా కాంగ్రెస్ తమ డిమాండ్లను పెట్టిందని, వీటిని చంద్రబాబు దాదాపుగా ఓకే చేయవచ్చని ఇరు పార్టీల వర్గాలూ అంటున్నాయి.

First Published:  10 Nov 2018 10:52 PM GMT
Next Story