Telugu Global
International

హానికరమైన 90ల‌క్ష‌ల పోస్టులను డిలీట్ చేసిన ఫేస్ బుక్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ హానికరమైన కంటెంట్ తొలిగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. హింసాత్మకంగా ఉందని భావించిన 1.4 కోట్ల కంటెంట్‌ను ఇప్పటికే ఫేస్‌బుక్ నుంచి తొలగించినట్టు ఖరారు చేసింది ఆ సంస్థ యాజమాన్యం. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ నెలల మధ్య పోస్ట్ చేసిన 90.4 లక్షల కంటెంట్‌పై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్… ఇందుకోసం ఎక్కువగా సరికొత్త టెక్నాలజీనే వాడుతున్నట్టు పేర్కొంది. ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్న 99 శాతం కంటెంట్ మొత్తాన్ని ఫేస్‌బుక్ నుంచి […]

హానికరమైన 90ల‌క్ష‌ల పోస్టులను డిలీట్ చేసిన ఫేస్ బుక్
X

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ హానికరమైన కంటెంట్ తొలిగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. హింసాత్మకంగా ఉందని భావించిన 1.4 కోట్ల కంటెంట్‌ను ఇప్పటికే ఫేస్‌బుక్ నుంచి తొలగించినట్టు ఖరారు చేసింది ఆ సంస్థ యాజమాన్యం.

ఈ ఏడాది ఏప్రిల్, జూన్ నెలల మధ్య పోస్ట్ చేసిన 90.4 లక్షల కంటెంట్‌పై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్… ఇందుకోసం ఎక్కువగా సరికొత్త టెక్నాలజీనే వాడుతున్నట్టు పేర్కొంది. ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్న 99 శాతం కంటెంట్ మొత్తాన్ని ఫేస్‌బుక్ నుంచి తొలగించినట్టు గ్లోబల్ హెడ్ ఆఫ్ పాలసీ మేనేజ్‌మెంట్ హెడ్ మోనికా బిక్కెర్ట్ తెలిపారు.

ఈ కంటెంట్ ను గుర్తించేందుకు సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఇకపై ఫేస్‌బుక్ ఖాతాదారులు ఎవ్వరూ ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేయకుండా ఈ టెక్నాలజీ నియంత్రిస్తుందని వివరించారు.

First Published:  10 Nov 2018 8:30 PM GMT
Next Story