Telugu Global
NEWS

కోదండా? పొన్నాలా? జనగామ ఎవరిది?

మహాకూటమి పొత్తు పొడవలేదు. అభ్యర్థులు ఖరారు కాలేదు. శనివారం నుంచి ఆదివారానికి కూటమి అభ్యర్థుల ఖరారు వాయిదా పడింది. సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు మొదలవుతున్నా.. ఇంకా మహాకూటమిలో అభ్యర్థుల సీట్లు సర్దుబాటు కావడం లేదు. తాజాగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన జనగామ టికెట్ పై చిక్కుముడి వీడడం లేదు. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్యను తప్పించి కూటమి తరఫున టీజేఎస్ […]

కోదండా? పొన్నాలా? జనగామ ఎవరిది?
X

మహాకూటమి పొత్తు పొడవలేదు. అభ్యర్థులు ఖరారు కాలేదు. శనివారం నుంచి ఆదివారానికి కూటమి అభ్యర్థుల ఖరారు వాయిదా పడింది. సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు మొదలవుతున్నా.. ఇంకా మహాకూటమిలో అభ్యర్థుల సీట్లు సర్దుబాటు కావడం లేదు.

తాజాగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన జనగామ టికెట్ పై చిక్కుముడి వీడడం లేదు. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్యను తప్పించి కూటమి తరఫున టీజేఎస్ వ్యవస్థాపకుడు కోదండరాం బరిలో నిలుస్తున్నారనే ప్రచారం సాగడం జనగామలో దుమారం రేపుతోంది.

అయితే కోదండరాంకు టికెట్ ఇస్తున్నారన్న ప్రచారంపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. కాంగ్రెస్ అధిష్టానంపై సంపూర్ణ విశ్వాసం ఉందని…. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ కుట్రకు తెరతీస్తున్నారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జనగామపై అధికారిక ప్రకటన చేయకపోవడంతో జనగామ బరిలో కోదండరాం నిలుస్తారా? పొన్నాల పోటీచేస్తారా? అన్న విషయం ఉత్కంఠగా మారింది.

అయితే బీసీ నేతగా… సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న పొన్నాల 70 ఏళ్లు పైబడడంతో వయసు మీరిన నేతలకు టికెట్లు ఇవ్వవద్దని రాహుల్ నిర్ణయించారట. దీంతో పొన్నాలకు ఈసారి టికెట్ వస్తుందా లేదా అన్నది సంశయంగా మారింది.

అయితే పొన్నాలకు టికెట్ ఇవ్వకపోతే టీఆర్ఎస్ తరఫున బరిలోకి దించేందుకు ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ లు రంగంలోకి దిగినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ పొన్నాలకు టికెట్ ఇస్తుందా.? లేక పొన్నాలకు అన్యాయం చేస్తుందా అనేది వేచిచూడాల్సిందే.

First Published:  11 Nov 2018 3:40 AM GMT
Next Story