చిరు సరసన మహేష్ హీరోయిన్

ప్రస్తుతం సైరా సినిమాలో నటిస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మేటర్ ఈ సినిమాకు సంబంధించినది కాదు. సైరా తర్వాత చిరు చేయబోయే మూవీ మేటర్ ఇది.

కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్నాడు చిరంజీవి. స్టోరీలైన్ కూడా ఓకే అయిపోయింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా కైరా అద్వానీ పేరు వినిపిస్తోంది. ఈమె పేరును స్వయంగా దర్శకుడు కొరటాల సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.

కైరాను టాలీవుడ్ కు పరిచయం చేసిన వ్యక్తి కొరటాల శివ. మహేష్ హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించింది కైరా. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి సరసన ఈ ముద్దుగుమ్మ నటించే అవకాశం ఉంది.