Telugu Global
Cinema & Entertainment

క్రిష్ తో మహేష్

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత క్రిష్ దర్శకత్వంలో మహేష్ నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి నిజానికి క్రిష్-మహేష్ కాంబోపై వార్తలు ఇప్పటివి కావు. ఆగడు సినిమా టైమ్ నుంచి ఈ కాంబినేషన్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ టైమ్ లో క్రిష్ చెప్పిన సబ్జెక్ట్ మహేష్ కు నచ్చక […]

క్రిష్ తో మహేష్
X

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. రెండు సినిమాల తర్వాత క్రిష్ దర్శకత్వంలో మహేష్ నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి

నిజానికి క్రిష్-మహేష్ కాంబోపై వార్తలు ఇప్పటివి కావు. ఆగడు సినిమా టైమ్ నుంచి ఈ కాంబినేషన్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ టైమ్ లో క్రిష్ చెప్పిన సబ్జెక్ట్ మహేష్ కు నచ్చక తిరస్కరించాడు. ఈసారి మాత్రం మహేష్ ను ఓ కొత్త కథతో మెప్పించాడట క్రిష్.

ఎన్టీఆర్ బయోపిక్ కంప్లీట్ అయిన వెంటనే మహేష్ ప్రాజెక్టుపైనే క్రిష్ వర్క్ చేస్తాడని తెలుస్తోంది. ప్రాజెక్టు కనుక సెట్ అయితే, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. మెగా హీరోలు కాకుండా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మూవీ చేయబోతున్న మొట్టమొదటి హీరోగా మహేష్ చరిత్ర సృష్టించబోతున్నాడన్నమాట.

First Published:  11 Nov 2018 9:05 AM GMT
Next Story