Telugu Global
Cinema & Entertainment

మరో కాస్టింగ్ కౌచ్ ఘటన

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలలో నటుడు నానా పటేకర్, మ్యూజిక్ డైరక్టర్ అను మాలిక్, దర్శకుడు సాజిద్ ఖాన్ ఇప్పటికే చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నటుడు కూడా వచ్చి చేరాడు. నానా పటేకర్ తర్వాత ఆ స్థాయిలో విలక్షణ నటుడు అనిపించుకున్న నవాజుద్దీన్ సిద్ధిఖి ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చవిచూస్తున్నాడు. ఇతడిపై ఆరోపణలు చేసిన హీరోయిన్ పేరు నిహారిక సింగ్. “ఓ రోజు నవాజ్ నన్ను భోజనానికి పిలిచారు. ఏదో చేయబోయాడు. అప్పుడు […]

మరో కాస్టింగ్ కౌచ్ ఘటన
X

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలలో నటుడు నానా పటేకర్, మ్యూజిక్ డైరక్టర్ అను మాలిక్, దర్శకుడు సాజిద్ ఖాన్ ఇప్పటికే చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నటుడు కూడా వచ్చి చేరాడు. నానా పటేకర్ తర్వాత ఆ స్థాయిలో విలక్షణ నటుడు అనిపించుకున్న నవాజుద్దీన్ సిద్ధిఖి ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చవిచూస్తున్నాడు. ఇతడిపై ఆరోపణలు చేసిన హీరోయిన్ పేరు నిహారిక సింగ్.

“ఓ రోజు నవాజ్ నన్ను భోజనానికి పిలిచారు. ఏదో చేయబోయాడు. అప్పుడు నేను తిరస్కరించాను. మరోసారి అతడు ఏకంగా నా ఇంటికే వచ్చాడు. కల్లబొల్లి మాటలు చెప్పాడు. కాళ్లావేళ్లా పడ్డాడు. మొత్తానికి నన్ను లోబరుచుకున్నాడు.”

ఈరోజు నుంచి తనను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడని ఆరోపిస్తోంది నిహారిక సింగ్. తను, నవాజ్ కొన్నాళ్లు సహజీవనం చేశామనే వార్తల్ని ఆమె ఖండిస్తోంది. అది సహజీవనం కాదని, కేవలం 2-3 సార్లు శారీరకంగా మాత్రమే కలిశామని, ఆ తర్వాత నవాజ్ గురించి నిజాలు తెలిసి పూర్తిగా తప్పుకున్నానని అంటోంది నిహారిక.

మిస్ ఇండియా ఎర్త్ గా పాపులరైన ఈ భామ, ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి అవకాశాలు రావడం లేదు. పూర్తిగా ఇంటికే పరిమితమైంది.

First Published:  10 Nov 2018 10:52 PM GMT
Next Story