Telugu Global
International

మోడీ నిర్ణయాలపై రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు

మోడీ గద్దెనెక్కాక తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రధానమైనవి…. ఈ నిర్ణయాలు దేశాన్నే షేక్ చేశాయి…. కోట్ల మందిపై ప్రభావం చూపాయి. దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి. నోట్ల రద్దు జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవలే పండుగ చేసుకున్నారు బీజేపీ శ్రేణులు . కానీ వారికి షాకిచ్చేలా అమెరికా కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రసంగిస్తూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత […]

మోడీ నిర్ణయాలపై రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు
X

మోడీ గద్దెనెక్కాక తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రధానమైనవి…. ఈ నిర్ణయాలు దేశాన్నే షేక్ చేశాయి…. కోట్ల మందిపై ప్రభావం చూపాయి. దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి. నోట్ల రద్దు జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవలే పండుగ చేసుకున్నారు బీజేపీ శ్రేణులు . కానీ వారికి షాకిచ్చేలా అమెరికా కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రసంగిస్తూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడిందని వాపోయారు.

ప్రధాని మోడీ ప్రధాని అయ్యాక ప్రధానమంత్రి కార్యాలయమే పరిపాలన కేంద్రం అయ్యిందని…. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణకు అనుమతిని ప్రధాని కార్యాలయం ఇవ్వడం ఆశ్చర్యపరిచిందన్నారు. సర్దార్ విగ్రహావిష్కరణలో ఉన్న వేగం అన్నింటా ఉండాలని హితవు పలికారు..

భారత్ లో ఇప్పుడు అధికార కేంద్రీకరణ రాజకీయ నిర్ణయాల్లో మరీ ఎక్కువైందని…. ఏకస్వామ్యంగా పీఎంవో కార్యాలయం వ్యవహరించడం నా అనుభవంలో చూడలేదని రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి సర్దార్ విగ్రహంలో చూపిన చొరవ…. ప్రతి అంశంలోనూ మనం చూడలేమా అని ప్రధాని మోడీ వైఖరిని ఎండగట్టారు. దీన్ని బట్టి భారత్ లో అధికారుల లేదా ఉద్యోగుల చేతిలో అధికారం లేకపోవడం కూడా మరో ప్రధాన సమస్య అన్నారు.

ప్రధాని మోడీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా కుదలేయ్యాయని.. తమకు తాముగా ఏ నిర్ణయం తీసుకోవడం లేదని రఘురాం రాజన్ విమర్శించారు. అవినీతి, కుంభకోణాలు బయటపడుతున్న కొద్దీ అధికారులు పాలనకు దూరంగా జరుగుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు వల్లే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అందుకోలేకపోతోందని రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్లరద్దుతోపాటు జీఎస్టీ వల్లే భారత్ పై ప్రభావం బాగా పడిందని చెప్పుకొచ్చారు.

First Published:  11 Nov 2018 12:48 AM GMT
Next Story