Telugu Global
Cinema & Entertainment

రవితేజ కార్యక్రమం వాయిదా పడింది

లెక్కప్రకారం ఈ మంగళవారం రవితేజ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాలి. అదే రోజు కొత్త సినిమా టైటిల్ లోగోను కూడా విడుదల చేస్తామని నిర్మాతలు ఎనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడా కార్యక్రమం వాయిదాపడింది. అమర్ అక్బర్ ఆంటోనీ విడుదల తర్వాత రవితేజ కొత్త సినిమా టైటిల్ ప్రకటిస్తామంటున్నాడు నిర్మాత రామ్ తళ్లూరి. వీఐ ఆనంద్ దర్సకత్వంలో, రవితేజ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేశాడు ఈ నిర్మాత. కాస్త వెరైటీగా ఉంటుందనే ఉద్దేశంతో ముందు టైటిల్ ప్రకటించి, […]

రవితేజ కార్యక్రమం వాయిదా పడింది
X

లెక్కప్రకారం ఈ మంగళవారం రవితేజ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాలి. అదే రోజు కొత్త సినిమా టైటిల్ లోగోను కూడా విడుదల చేస్తామని నిర్మాతలు ఎనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడా కార్యక్రమం వాయిదాపడింది. అమర్ అక్బర్ ఆంటోనీ విడుదల తర్వాత రవితేజ కొత్త సినిమా టైటిల్ ప్రకటిస్తామంటున్నాడు నిర్మాత రామ్ తళ్లూరి.

వీఐ ఆనంద్ దర్సకత్వంలో, రవితేజ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేశాడు ఈ నిర్మాత. కాస్త వెరైటీగా ఉంటుందనే ఉద్దేశంతో ముందు టైటిల్ ప్రకటించి, ఆ తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకున్నారు. కానీ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ప్రచారంలో రవితేజ బిజీగా ఉన్నాడని, ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత తమ కార్యక్రమం పెట్టుకుంటామని ట్వీట్ చేశాడు సదరు నిర్మాత.

వీఐ ఆనంద్, రవితేజ కాంబోలో సైన్స్ ఫిక్సన్ కాన్సెప్టుతో సినిమా రాబోతోంది. ఈ మూవీలో ఇప్పటికే నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్లుగా తీసుకున్నారు. మూడో హీరోయిన్ కోసం వెదుకుతున్నారు. ఈ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

First Published:  10 Nov 2018 11:11 PM GMT
Next Story