ఆర్-ఆర్-ఆర్ గ్రాండ్ లాంచ్

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ ప్రాజెక్టు గ్రాండ్ గా లాంఛ్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. ప్రభాస్, రానా, కల్యాణ్ రామ్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్, చరణ్ మెయిన్ ఎట్రాక్షన్స్ గా నిలిచారు.

ఈ సినిమా లాంఛ్ సందర్భంగా ఎన్నో పుకార్లపై క్లారిటీ వస్తుందని మీడియా అంచనావేసింది. మరీ ముఖ్యంగా తారక్, చెర్రీ పాత్రలపై ఓ క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ మీడియాకు అంత ఛాన్స్ ఇవ్వలేదు జక్కన్న. మీడియాను ఎవర్నీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. వాళ్లలో వాళ్ల కొబ్బరికాయ కొట్టుకొని, క్లాప్ కొట్టుకున్నారు.

ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ నవంబ‌ర్ 19 నుండి స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీ సెట్‌లో రెండు వారాల పాటు ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను తెర‌కెక్కించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో చేయ‌బోయే మిగ‌తా న‌టీన‌టులు, హీరోయిన్ల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.