Telugu Global
NEWS

ఆ సైడ్ నుంచి ఉత్త‌మ్ న‌రుక్కొస్తున్నారా?

కాంగ్రెస్ రాజ‌కీయాలే వేరు. ఎత్తుగ‌డ‌ల్లో ఒక‌రిని మించిన ఘ‌నులు మ‌రొక‌రు. ఎన్నిక‌ల వేళ‌…. టికెట్ల గోల స‌మ‌యంలోనే కాంగ్రెస్ నేత‌ల రాజ‌కీయాలు డైలీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తున్నాయి. ప్ర‌స్తుతం టికెట్ల కేటాయింపు కూడా ఇలాగే సాగుతోంది. ఈ టికెట్ల కేటాయింపు వెనుక మాత్రం ఉత్త‌మ్ త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ పెట్టేలా వ్యూహం ర‌చిస్తున్నార‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ గెలిచింద‌ని అనుకుందాం…. ముఖ్య ప‌ద‌వి రేసులో త‌న‌కు పోటీగా వ‌చ్చే నేత‌లు లేకుండా చూసేందుకు ఉత్త‌మ్ వ్యూహాత్మ‌కంగా పావులు […]

ఆ సైడ్ నుంచి ఉత్త‌మ్ న‌రుక్కొస్తున్నారా?
X

కాంగ్రెస్ రాజ‌కీయాలే వేరు. ఎత్తుగ‌డ‌ల్లో ఒక‌రిని మించిన ఘ‌నులు మ‌రొక‌రు. ఎన్నిక‌ల వేళ‌…. టికెట్ల గోల స‌మ‌యంలోనే కాంగ్రెస్ నేత‌ల రాజ‌కీయాలు డైలీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తున్నాయి. ప్ర‌స్తుతం టికెట్ల కేటాయింపు కూడా ఇలాగే సాగుతోంది. ఈ టికెట్ల కేటాయింపు వెనుక మాత్రం ఉత్త‌మ్ త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ పెట్టేలా వ్యూహం ర‌చిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ గెలిచింద‌ని అనుకుందాం…. ముఖ్య ప‌ద‌వి రేసులో త‌న‌కు పోటీగా వ‌చ్చే నేత‌లు లేకుండా చూసేందుకు ఉత్త‌మ్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌నే అనుమానాలు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల్లో క‌నిపిస్తోంది. కూట‌మి పేరు చెప్పి త‌మ సీట్ల‌కు ఉత్త‌మ్ కోత పెడుతున్నార‌ని వీరికి పెద్ద డౌట్‌.

న‌ల్గొండ రాజ‌కీయాల్లో ఉత్త‌మ్‌, జానా, కోమటిరెడ్డి ఒక్కొక్కరు ఓ బ్యాచ్‌. ఇందులో కోమ‌టిరెడ్డి సోద‌రుల‌కు మునుగోడు, న‌కిరేక‌ల్ టికెట్లు రాకుండా ఉత్త‌మ్ పావులు క‌దుపుతున్నార‌ని కోమ‌టిరెడ్డి వ‌ర్గంలో ఓ అనుమానం ఉంది. మునుగోడు నుంచి రాజ‌గోపాల్‌రెడ్డి, న‌కిరేక‌ల్ నుంచి చిరుమ‌ర్తి లింగ‌య్య పోటీ చేయ‌కుండా…. కూట‌మికి ఈ సీట్లు ఇస్తున్న‌ట్లు ప్రచారం మొద‌లైంది.

మునుగోడు సీపీఐకి, న‌కిరేక‌ల్ తెలంగాణ ఇంటి పార్టీ చెర‌కు సుధాక‌ర్‌ భార్యకు ఇవ్వాల‌ని ఉత్త‌మ్ ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్లు స‌మాచారం. ఈ రెండు సీట్లు పోతే కోమ‌టిరెడ్డి హ‌వాకు బ్రేక్ ప‌డిన‌ట్లే. న‌ల్గొండ‌లో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో అక్క‌డ ఆయ‌న గెలిస్తే స‌రి. లేక‌పోతే కోమ‌టిరెడ్డి బ్యాచ్‌కు మొత్తం చెక్ ప‌డిన‌ట్లు అవుతుంద‌ని ఉత్త‌మ్ భావ‌న‌గా తెలుస్తోంది.

న‌ల్గొండ‌లోనే మ‌రో సీనియ‌ర్ నేత జానారెడ్డి కొడుకు మిర్యాల‌గూడ సీటుకు కూడా ఉత్త‌మ్ ఎస‌రు పెట్టిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. మిర్యాల‌గూడ నుంచి టీజేఎస్ పోటీ చేస్తుంద‌ని ఓ వార్త వ‌దిలారు. దీంతో అక్క‌డ జ‌గ‌డం మొద‌లైంది. జ‌న‌గామ నుంచి కోదండ‌రాం పోటీ చేస్తార‌ని మ‌రో సీనియ‌ర్ నేత పొన్నాల ల‌క్ష్మ‌య్య‌కు పొగ‌పెట్టారు. దీంతో ఆయ‌న అక్క‌డ డిఫెన్స్‌లో ప‌డ్డారు.

రేవంత్‌ వ‌ర్గానికి చెక్ పెట్టేందుకు ఉత్త‌మ్ ఏకంగా ఆశ‌వ‌హుల లిస్ట్‌ను ఓ చాన‌ల్‌కు ఇచ్చి విడుద‌ల చేశార‌ని తెలుస్తోంది. దీంతో త‌మ‌కు సీటు రాద‌ని తెలిసిన నేత‌లు ఢిల్లీకి క్యూ క‌ట్టేలా ఉత్త‌మ్ ఈ పాచిక విసిరార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దీంతో హైక‌మాండ్‌తో పాటు స్క్రీనింగ్ క‌మిటీపై ఒత్తిడి పెంచి కొన్ని సీట్లు ఆపేలా ఉత్త‌మ్ ఈ ప్లాన్ చేశార‌ని రేవంత్‌తో పాటు ఇత‌రులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి ఉత్త‌మ్ వేస్తున్న ఎత్తులకు…. ఎవ‌రి సీట్ల‌కు గండి ప‌డుతుందో తెలియాలంటే కాంగ్రెస్ జాబితా వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.

First Published:  10 Nov 2018 8:41 PM GMT
Next Story