Telugu Global
NEWS

టీ-20 మహిళా ప్రపంచకప్ లో సూపర్ సండే ఫైట్

భారత్ కు పాకిస్థాన్ మహిళల సవాల్ గయానా వేదికగా రాత్రి 7-30కి మ్యాచ్ ప్రారంభం కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న టీ-20 మహిళా ప్రపంచకప్ గ్రూప్ -బీ లీగ్ లో…ఐదో ర్యాంకర్ భారత్ వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది. గయానా నేషనల్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో… పాకిస్థాన్ పని పట్టడానికి… హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. ప్రారంభమ్యాచ్ లో రెండో ర్యాంకర్ న్యూజిలాండ్ పై […]

టీ-20 మహిళా ప్రపంచకప్ లో సూపర్ సండే ఫైట్
X
  • భారత్ కు పాకిస్థాన్ మహిళల సవాల్
  • గయానా వేదికగా రాత్రి 7-30కి మ్యాచ్ ప్రారంభం

కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న టీ-20 మహిళా ప్రపంచకప్ గ్రూప్ -బీ లీగ్ లో…ఐదో ర్యాంకర్ భారత్ వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది.

గయానా నేషనల్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో… పాకిస్థాన్ పని పట్టడానికి… హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది.

ప్రారంభమ్యాచ్ లో రెండో ర్యాంకర్ న్యూజిలాండ్ పై సాధించిన సంచలన విజయం జోష్ తో భారత్ బరిలోకి దిగుతోంది.

మరో వైపు తన ప్రారంభమ్యాచ్ లో…ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పొందిన పాక్ జట్టు…సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే…. భారత్ తో జరిగే మ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది. భారత కాలమానప్రకారం… ఆదివారం రాత్రి 7-30 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది.

First Published:  10 Nov 2018 8:49 PM GMT
Next Story